మంగళవారం సంకట మోచన హనుమంతుడికి అంకితం చేయబడింది. ఈ రోజున చెడు దృష్టి నుంచి రక్షణ కోసం, ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించేందుకు హనుమంతుడికి చేసే చర్యలు ప్రభావవంతంగా ఉంటాయి. మంగళవారం హనుమంతుడిని పూజిస్తారు. చెడు దృష్టి నుంచి రక్షించడానికి ఈ రోజు ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. మంగళవారం చెడు దృష్టి నుంచి ఉపశమనం కోసం చర్యలు తీసుకోవడంతో పాటు బజరంగబలిని పూజించడం ద్వారా ప్రతి సమస్యను సులభతరం చేసుకోవచ్చు.
మంగళవారం రోజున చెడుదృష్టి నుంచి తప్పించుకోవడానికి వివిధ చర్యలు తీసుకోవచ్చు. ఈ నేపధ్యంలో ఈ రోజు ఆ చర్యలు ఏమిటో తెలుసుకుందాం ఇవి ఇంటికి ఆనందం , శ్రేయస్సును అందించవచ్చు, చెడు దృష్టి నుంచి రక్షించవచ్చు.
హనుమంతుడికి అంకితం చేయబడిన మంగళవారం రోజున చేయాల్సిన చర్యలు ఏమిటంటే..
ఇవి కూడా చదవండి
కర్పూరం నివారణ
మంగళవారం మీ ఇంట్లో కర్పూరం వెలిగించడం చాలా శుభప్రదం. కర్పూరం వెలిగించడం వల్ల ఇంటి నుంచి ప్రతికూల శక్తి నాశనం అవుతుంది. అలాగే చెడు దృష్టి బారిన పడిన వ్యక్తి తల చుట్టూ 5 కర్పూరం ముక్కలను వ్యతిరేక దిశలో 7 సార్లు తిప్పి.. ఆపై వాటిని ఒక మట్టి కుండలో వేసి వెలిగించండి.
హనుమంతుడి పూజ
మంగళవారం రోజున సంకట మోచన హనుమంతుడిని పూజించండి. ఆయనకు సింధురాన్ని సమర్పించి హనుమాన్ చాలీసా లేదా బజరంగ్ బాన్ పఠించండి. ఇలా చేయడం వల్ల మీకు చెడు దృష్టి నుంచి విముక్తి లభిస్తుంది. ఈ రోజున ఆలయంలో హనుమంతుడి పాదాల బొటనవేలు నుంచి సింధూరాన్ని తీసుకొని చెడు దృష్టితో బాధపడుతున్న వ్యక్తి నుదిటిపై బొట్టుగా పెట్టండి. ఇలా చేయడం ద్వారా హనుమంతుడి ఆశీస్సులు ఆ వ్యక్తిపై ఉంటాయి.
ఉప్పు, ఆవాలతో చెడు దృష్టి నుంచి రక్షణ
ఒక గుప్పెడు ఉప్పు, కొన్ని ఆవాలు తీసుకొని.. ఎవరి ఉన్న చెడు దృష్టిని తొలగించాలో వారిపై 7 సార్లు తిప్పి, ఇంటికి దూరంగా విసిరేయండి. మంగళవారం ఈ పరిహారం చేయడం ద్వారా చెడు ద్రుష్టి నుంచి రక్షణ పొందవచ్చు.
లవంగం నివారణ
మంగళవారం నాడు హనుమంతుడిని పూజించేటప్పుడు.. దీపం వెలిగించే సముయంలో దీపంలో రెండు లవంగాలు వేసి వెలిగించండి. ఇలా చేయడం ద్వారా ఇంట్లో వ్యాపించిన ప్రతికూలత నశించి, అన్ని చింతలను తొలగించే హనుమంతుడు తన భక్తులను రక్షిస్తాడని నమ్మకం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.