Kerala Dgp Ravada Azad Chandrasekhar: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రావాడ ఆజాద్ చంద్రశేఖర్ కేరళ డీజీపీగా నియమితులయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరానికి చెందిన ఆయన 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న చంద్రశేఖర్, ఐబీలో స్పెషల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. కేరళ సీఎం పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. చంద్రశేఖర్ గతంలో కేరళలో వివిధ హోదాల్లో పనిచేశారు. జులై 2026లో ఆయన పదవీ విరమణ చేయనున్నారు.
హైలైట్:
- కేరళ డీజీపీగా ఏపీకి చెందిన చంద్రశేఖర్
- ప్రస్తుతం ఆయన కేంద్ర సర్వీసులో ఉన్నారు
- చంద్రశేఖర్ 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి

ఆయన రెండేళ్ల పాటూ ఈ డీజీపీ పోస్టులో ఉంటారు. చంద్రశేఖర్ కేరళలో సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. కేరళ డీజీపీగా బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వానికి చంద్రశేఖర్ ధన్యవాదాలు తెలిపారు.. గతంలో కేరళలో పనిచేసిన అనుభవం ఉందని.. ఈ కీలక బాధ్యతల్ని సమర్ధవంతంగా నిర్వహిస్తానన్నారు.. త్వరలో బాధ్యతలు స్వీకరిస్తానన్నారు.ఆజాద్ చంద్రశేఖర్ గతంలో కేరళలోని వయనాడ్, పాలక్కాడ్ జిల్లాల్లో ఎస్పీగా.. తిరువనంతపురం సిటీ పోలీస్ కమిషనర్‌గా.. త్రిశ్శూర్, కొచ్చి రేంజ్‌ల డీఐజీగా కీలక బాధ్యతల్లో ఉన్నారు. 2015లో చంద్రశేఖర్ డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసులకు వెళ్లి ఐబీలో ఏపీ కేంద్రంగా ఎక్కువ కాలం విధులు నిర్వహించారు. కేంద్ర డిప్యుటేషన్‌పై ఇంటెలిజెన్స్ బ్యూరో (IB)కి DIGగా బదిలీ చేశారు. చంద్రశేఖర్ పదవీకాలంలో, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, భువనేశ్వర్‌లలో ఇంటెలిజెన్స్ బ్యూరోలో DIG, IG, ADGP, డైరెక్టర్ జనరల్‌తో సహా అనేక సీనియర్ పదవులను నిర్వహించారు.
Kuppam woman incident: కుప్పం మహిళకు చంద్రబాబు ఫోన్.. స్పాట్‌లోనే రూ.5 లక్షలు
అంతేకాదు ఇటీవల కేబినెట్ సెక్రటరియేట్‌లో సెక్యూరిటీ వింగ్‌లో నియమితులయ్యారు.. ఈ బాధ్యతల్ని ఆగస్టులో చేపట్టాల్సి ఉండగా.. ఇంతలో కేరళ ప్రభుత్వం డీజీపీగా నియమించింది. ఆయన మంగళవారం డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. చంద్రశేఖర్ కేరళ డీజీపీగా నియమితులు కావడంతో వీరవాసరంలో బంధువులు, స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాదు చంద్రశేఖర్ రాష్ట్రపతి నుంచి అవార్డుల్ని కూడా అందుకున్నారు. చంద్రశేఖర్ జులై 2026లో పదవీ విరమణ చేయనున్నారు.