సినిమా ఇండస్ట్రీలోని కొన్ని కాంబినేషన్లు చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఒక సినిమాలో హీరోయిన్‌గా నటించిన బ్యూటీ.. మరో సినిమాలో అదే హీరోకు వేరే పాత్రలో కనిపిస్తుంది. ఈ టాలీవుడ్ అందాల తార కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. తన అందం, అభినయంతో తెలుగుతో పాటు తమిళ భాషల్లోనూ ఓ వెలుగు వెలిగిందీ స్టార్ హీరోయిన్. టాలీవుడ్, కోలీవుడ్ లోని స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేసి సూపర్ హిట్స్ కొట్టింది. తెలుగులో అయితే మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు, శ్రీకాంత్.. ఇలా ఎందరో స్టార్ హీరోలతోనూ జత కట్టింది. ముఖ్యంగా బాలకృష్ణతో ఈ అమ్మడు కలిసి నటించిన సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. అయితే పలు సినిమాల్లో బాలయ్య సరసన హీరోయిన్ గా నటించిన ఈ అందాల తార ఒక మూవీలో మాత్రం బామ్మగా నటించింది. కట్ చేస్తే.. ఈ స్టార్ హీరోయిన్ ఒక సినిమాలో మహేష్ బాబుకు ప్రియురాలిగా, భార్యగా నటించింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరా అనుకుంటున్నారా? ఆమె మరెవరో కాదు ఒకప్పుడు తన అందంతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేసిన సిమ్రాన్.
టాలీవుడ్ లో బాలయ్య- సిమ్రాన్ లది హిట్ జోడీ. వీరి కాంబినేషన్ లో సమర సింహారెడ్డి, నరసింహ నాయుడు, గొప్పింటి అల్లుడు, సీమ సింహం, ఒక్క మగాడు సినిమాలు వచ్చాయి. వీటిలో రెండు సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. అయితే దాదాపు అన్ని సినిమాల్లోనూ బాలయ్య సరసన హీరోయిన్ గా నటించిన సిమ్రాన్ ఒక్క మగాడు సినిమాలో అదే బాలయ్యకు నానమ్మగా నటించింది. అయితే ఈ ప్రయోగం ఫెయిల్ అయ్యింది. సినిమా డిజాస్టర్ గా నిలిచింది.
ఇవి కూడా చదవండి
అలనాటి హీరోయిన్ సిమ్రాన్ లేటెస్ట్ ఫొటోస్..
ఇక మహేష్ బాబు నటించిన యువరాజు సినిమాలో సిమ్రాన్ హీరోయిన గా నటించింది. ఇందులో ఆమె మహేష్ ప్రియురాలిగా, భార్యగా అద్బుతంగా నటించింది. వైవీఎస్ చౌదరి తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇదే సినిమాలో సాక్షి శివానంద్ మరో హీరోయిన్ గా నటించింది.
ఇటీవలే సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది సిమ్రాన్. ఆమె లేటెస్ట్ గా నటించిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..