Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Credit Card: మీరు క్రెడిట్ కార్డుతో బంగారం కొనడం లాభమా? నష్టమా?

1 July 2025

జుట్టు తెల్లబడకుండా ఉండాలంటే ఇలా చేయండి.. యవ్వనంగా కనిపిస్తారు..!

1 July 2025

Nara Lokesh: పసివాడి ప్రాణం కాపాడిన నారా లోకేష్..

1 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Visakhapatnam Raipur National Highway 130 Cd,ఏపీలో కొత్త నేషనల్ హైవే రూ.3వేల కోట్లతో.. ఈ రూట్‌లో ఆరు లైన్లుగా, 12 గంటలు కాదు 6 గంటల్లోనే వెళ్లొచ్చు – visakhapatnam raipur express highway works speed up and latest update
ఆంధ్రప్రదేశ్

Visakhapatnam Raipur National Highway 130 Cd,ఏపీలో కొత్త నేషనల్ హైవే రూ.3వేల కోట్లతో.. ఈ రూట్‌లో ఆరు లైన్లుగా, 12 గంటలు కాదు 6 గంటల్లోనే వెళ్లొచ్చు – visakhapatnam raipur express highway works speed up and latest update

.By .1 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Visakhapatnam Raipur National Highway 130 Cd,ఏపీలో కొత్త నేషనల్ హైవే రూ.3వేల కోట్లతో.. ఈ రూట్‌లో ఆరు లైన్లుగా, 12 గంటలు కాదు 6 గంటల్లోనే వెళ్లొచ్చు – visakhapatnam raipur express highway works speed up and latest update
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Visakhapatnam Raipur Express Highway: ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం నుండి ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌కు ఆరు గంటల్లోనే చేరుకునేలా కొత్త జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే విశాఖ, విజయనగరం, పార్వతీపురం మీదుగా వెళుతుంది. ప్రస్తుతం 12 గంటలు పట్టే ప్రయాణ సమయం సగానికి తగ్గుతుంది. విశాఖ పోర్టు నుంచి సరుకులు త్వరగా చేరవేయడానికి ఇది ఉపయోగపడుతుంది. వచ్చే ఏడాది చివరి నాటికి ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.

హైలైట్:

  • ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే
  • 90శాతం పనులు పూర్తి చేశారు
  • విశాఖ టు రాయపూర్‌ 6 గంటల్లో
విశాఖ టు రాయ్‌పూర్‌ 6 గంటల్లో దూసుకెళ్లొచ్చు
విశాఖ టు రాయ్‌పూర్‌ 6 గంటల్లో దూసుకెళ్లొచ్చు (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్‌లో మరో నేషనల్ హైవే ప్రజలకు అందబాటులోకి రాబోతోంది. విశాఖపట్నం నుంచి ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌కు త్వరగా వెళ్లొచ్చు. కేవలం ఆరు గంటల్లోనే విశాఖ నుంచి రాయ్‌పూర్ చేరుకోవచ్చు. ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల మీదుగా వెళుతోంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఈ హైవే పనులు చివరి దశకు చేరాయి. వచ్చే ఏడాది చివరి నాటికి ఈ హైవే పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. విశాఖపట్నం పోర్టు నుంచి ఇతర ప్రాంతాలకు సరుకులు త్వరగా చేరవేసేందుకు ఈ హైవే కీలకంగా మారనుంది. విశాఖపట్నం నుంచి రాయ్‌పూర్‌ వెళ్లాలంటే.. ప్రస్తుతం 12 నుంచి 13 గంటలు సమయం పడుతోంది. ఉత్తరాంధ్ర ప్రజలు సాలూరు, కోరాపుట్, జయపుర మీదుగా రాయపూర్.. అలాగే బొబ్బిలి, పార్వతీపురం, రాయగడ మీదుగా రాయపూర్ వెళ్లాల్సి ఉంటుంది. అయితే విశాఖపట్నం టు రాయపూర్ 464 కిలోమీటర్ల మేర ఆరు లైన్లుగా.. యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ ఎకనామిక్ కారిడార్‌ నిర్మాణం జరుగుతోంది. ఈ హైవే అందుబాటులోకి వస్తే విశాఖపట్నం నుంచి రాయపూర్‌కు 12 గంటల బదులు ఆరు గంటల్లోనే చేరుకోచ్చు.. దాదాపు సగానికి సగం ప్రయాణ సమయం తగ్గుతుంది. అంతేకాదు ఈ రాయపూర్ హైవేకు విశాఖపట్నం సమీపంలోని సబ్బవరం దగ్గర కోల్‌కతా-చెన్నై నేషనల్ హైవే 16 కూడా కలుస్తుంది.

ఈ నేషనల్ హైవే ఏపీలో 100 కిలో మీటర్లు పొడవు.. ఒడిశాలో 241 కిలోమీటర్లు.. ఛత్తీస్‌గఢ్‌లో 125 కిలోమీటర్ల పొడవున ఉంది. మొత్తం 18 ప్యాకేజీలో ఈ హైవేను విభజించారు.. ఏపీలో అయితే 90శాతం పనులు పూర్తి చేసి ముగింపు దశకు వచ్చారు.. కానీ ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో పనులు కొనసాగుతున్నాయి. కొన్ని భూ సమస్యల వల్ల ఏపీలో పనులు కొంత ఆలస్యం అయ్యాయి.. లేని పక్షంలో ఈపాటికి పనులు పూర్తిచేసి ఉండేవారు. మరో పది నెలల్లో ఏపీ పరిధిలోని 100 కిలోమీటర్ల హైవే పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందంటున్నారు.

ఒలింపిక్స్‌లో యోగా.. మోదీ తలచుకుంటే ఏదైనా సాధ్యమే: చంద్రబాబు

ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో పనులు వచ్చే ఏడాది చివరినాటికి పూర్తవుతాయంటున్నారు. ఏపీలో ఉన్న 100 కిలోమీటర్ల హైవే కోసం రూ.3వేల కోట్లు కేటాయించారు. ఈ హైవే విశాఖపట్నం సమీపంలోని సబ్బవరం దగ్గర కోల్‌కత్తా-చెన్నై హైవేలో కలిసే ప్రాంతంలో టంప్రెట్ ఇంటర్‌ఛేంజ్‌ను నిర్మించారు. అంతేకాదు ఈ హైవేలోకి ఎంటర్ కావడానికి, బయటకు రావడానికి ఆరుచోట్ల అవకాశం ఉంది. ఈ హైవేలోకి ఆటోలు, బైక్‌లు, ట్రాక్టర్లు వంటివాటికి అనుమతి లేదు. అలాగే ఈ హైవేకు సర్వీస్ రోడ్లు కూడా ఉండవు. ఈ హైవే అందుబాటులోకి వస్తే రాయపూర్‌కు ఆరు గంటల్లోనే దూసుకెళ్లొచ్చు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి