Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

రెండేళ్లకే ప్రపంచ రికార్డు.. ఈ బుడ్డోడి ట్యాలెంట్‌ మామూలుగా లేదుగా వీడియో

1 July 2025

Andhra: బీడు భూమిలో ఏదో వింత చప్పుళ్లు.. ఏంటా అని రైతు వెళ్లి చూడగా

1 July 2025

Hyderabad: అమ్యామ్యా తీసుకుంటూ అడ్డంగా బుక్కైన కూకట్‌పల్లి టాక్స్ సీనియర్ ఆఫీసర్.. వీడియో

1 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Kurnool Missing Boy Returns After 32 Years,మూడేళ్ల వయసులో రైలెక్కి తప్పిపోయి.. 32 ఏళ్లకు ఫ్యామిలీని వెతుక్కుంటూ తిరిగొచ్చి.. రియల్ స్టోరీ – boy missing at the age three years and returned after 32 years to home in adoni kurnool district
ఆంధ్రప్రదేశ్

Kurnool Missing Boy Returns After 32 Years,మూడేళ్ల వయసులో రైలెక్కి తప్పిపోయి.. 32 ఏళ్లకు ఫ్యామిలీని వెతుక్కుంటూ తిరిగొచ్చి.. రియల్ స్టోరీ – boy missing at the age three years and returned after 32 years to home in adoni kurnool district

.By .1 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Kurnool Missing Boy Returns After 32 Years,మూడేళ్ల వయసులో రైలెక్కి తప్పిపోయి.. 32 ఏళ్లకు ఫ్యామిలీని వెతుక్కుంటూ తిరిగొచ్చి.. రియల్ స్టోరీ – boy missing at the age three years and returned after 32 years to home in adoni kurnool district
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Adoni Missing Boy Returns After 32 Years: 32 ఏళ్ల క్రితం తప్పిపోయిన వీరేష్ అనే వ్యక్తి తన తల్లిదండ్రులను వెతుక్కుంటూ తిరిగి వచ్చాడు. మూడు సంవత్సరాల వయస్సులో రైలు ఎక్కి చెన్నై చేరుకున్నానని, ఆ తర్వాత ముంబైలో పెరిగానని తెలిపాడు. ఆదోనిలోని తన కుటుంబ సభ్యుల ఆచూకీ తెలుపమని సబ్ కలెక్టర్‌ను వేడుకున్నాడు. హిందీ, మరాఠీ భాషలు మాత్రమే మాట్లాడే వీరేష్‌కు తెలుగు రాదు. అధికారులు అతడి కుటుంబ సభ్యుల కోసం గాలిస్తున్నారు.

హైలైట్:

  • కర్నూలు జిల్లా ఆదోనిలో ఘటన
  • మూడేళ్ల వయసులో వెళ్లిపోయాడు
  • 32 ఏళ్ల వయసులో తిరిగొచ్చాడు
  • ఫ్యామిలీ కోసం వెతుకుతూ..
ఆదోని మూడేళ్లకు రైలెక్కి 32 ఏళ్లకు తిరిగొచ్చి
ఆదోని మూడేళ్లకు రైలెక్కి 32 ఏళ్లకు తిరిగొచ్చి (ఫోటోలు– Samayam Telugu)

ఆ కుర్రాడు మూడేళ్ల వయసులో రైలెక్కి వెళ్లిపోయాడు.. సీన్ కట్ చేస్తే 32 ఏళ్లకు తల్లిదండ్రుల ఆచూకీ వెతుక్కుంటూ సొంత ఊరికి తిరిగొచ్చాడు. తన కుటుంబ సభ్యుల జాడ చెప్పాలంటూ సబ్ కలెక్టర్‌ను కలిశారు. కర్నూలు జిల్లాలో 32 ఏళ్ల క్రితం జరిగిన ఈ రియల్ స్టోరీలో సినిమాను మించిన ట్విస్ట్‌లు ఉన్నాయి. ఆదోని వెంకన్నపేటలో తన తండ్రి జనార్దన్, తల్లి, నానమ్మ రామాంజనమ్మతో కలిసి ఉండేవాడినని వీరేష్ జనార్దన్ చెబుతున్నారు. తనకు మూడేళ్ల వయసు ఉన్నప్పుడు ఆడుకుంటూ పొరపాటున రైలెక్కి తమిళనాడు రాజధాని చెన్నై వెళ్లానని చెబుతున్నాడు. అలా మూడేళ్ల వయసులో చెన్నై వెళ్లిన తనను రైల్వే పోలీసులు చేరదీశారని.. 1994 ఫిబ్రవరి 8న తనను అక్కడే బోర్డింగ్‌ స్కూల్లో చేర్పించారన్నారు.చెన్నై వెళ్లిన సమయంలో పోలీసులకు సంబంధించిన ఫిర్యాదు కూడా తన దగ్గర ఉందన్నారు వీరేష్. కొంతకాలానికి చెన్నై నుంచి ముంబై వెళ్లి అక్కడ అనాథాశ్రమంలో చేరానన్నారు. ముంబైలోనే చదువుకుని.. అక్కడే ఉంటున్నట్లు వివరించారు. తాను ఒక బార్ అండ్ రెస్టారెంట్‌లో వెయిటర్ ఉద్యోగం చేస్తున్నానన్నారు. మళ్లీ ఇన్నాళ్లకు తనది ఆదోని అని, తన తల్లిదండ్రులు, నాన్నమ్మ విషయం గుర్తుకొచ్చిందని.. అందుకే మూడు రోజుల క్రితం ఇక్కడికి వచ్చానన్నారు.

తాను తన కుటుంబసభ్యుల ఎక్కడున్నారో ఆచూకీ కోసం వెతుకుతున్నానని.. సాయం చేయమని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్‌ను కలిసి కోరానన్నారు. సబ్ కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించి.. తన కుటుంబసభ్యుల అడ్రస్ వెతికిపెట్టాలని మున్సిపల్ అధికారుల్ని ఆదేశించినట్లు వీరేష్ చెబుతున్నారు. వీరేష్‌కు హిందీ, మరాఠి భాషలు మాత్రమే వచ్చు.. తెలుగు రాదు. అధికారులు ఎలాగైనా తన ఫ్యామిలీ ఆచూకీ కనిపెట్టాలని కోరుతున్నారు.

ఎప్పుడో మూడేళ్ల వయసులో ఇంటి నుంచి వెళ్లిపోయిన వీరేష్‌కు ఇప్పుడు కుటుంబసభ్యులు గుర్తుకురావడం ఆశ్చర్యమనే చెప్పాలి. ఊరు, తల్లిదండ్రులు, నాన్నమ్మ గురించి చెబుతున్నా.. మిగిలిన విషయాలేవీ తెలియదంటున్నారు. మరి అతడికి కుటుంబసభ్యుల వివరాలు తెలుస్తాయా.. మళ్లీ వారికి దగ్గరవుడతాాడా లేదా అన్నది చూడాలి మరి.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి