రుతుపవనాల కారణంగా కురుస్తున్న భారీ వర్షాకలు హర్యాణ చిగురుటాకుల వణికిపోతోంది. గత కొద్ది రోజులుగా నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం రాత్రి నుండి యమునానగర్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. సరస్వతి చక్కెర మిల్లు తీవ్రంగా ప్రభావితమైంది. మిల్లు సమీపంలోని డ్రెయిన్ పొంగిపొర్లింది. నగరం నుండి మురికి నీరు గిడ్డంగిలోకి ప్రవేశించింది. దీంతో గోదాంలో నిల్వవుంచి చక్కెర పెద్ద మొత్తంలో కరిగి నీరందైని తెలిసింది.
హరియాణాలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు యమునానగర్‌లో ఉన్న ఆసియాలోనే అతిపెద్ద సరస్వతి షుగర్ మిల్‌లోకి వరద నీరు భారీగా వచ్చి చేరింది. ఫలితంగా సుమారు రూ.50 నుండి రూ.60 కోట్ల విలువైన పంచదార వరద నీటిలో కరిగిపోయిందని అధికారులు తెలిపారు. మొత్తం నిల్వలో సుమారు 40 శాతం నష్టం వాటిల్లిందని తెలిపారు. గోదాంలో రూ.97 కోట్ల విలువైన 2.20 లక్షల క్వింటాళ్ల పంచదార ఉండగా, తుది నష్టం మొత్తం గోదాంను పరిశీలించిన తరువాతే తెలుస్తుందని చెప్పారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..