నిజానికి పచ్చి ఉల్లిపాయలు గుండె సమస్యలు ఉన్నవారు తప్పకుండా తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పచ్చి ఉల్లిపాయలు గుండె సమస్యలు ఉన్నవారు 40 రోజుల పాటు తినడం వల్ల అద్భుతమైన లాభాలు పొందుతారు. ఉల్లిపాయలోని సల్ఫర్ రక్తపోటును, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఫలితంగా గుండె జబ్బులు, హార్ట్ స్ట్రోక్ వంటివి దరి చేరకుండా ఉంటాయి.
ముఖ్యంగా పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల అందులో లభించే క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని కొవ్వును సులభంగా కరిగిస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా గుండె సమస్యలు ఉన్నవారు అలాగే చెడు కొలెస్ట్రాల్ తో బాధపడుతున్న వారు తప్పకుండా పచ్చి ఉల్లిపాయలను ఆహారంలో భాగంగా తీసుకోండి.
కొంతమందిలో మంచి ఉల్లిపాయలు తింటే అందులో లభించి సల్ఫర్ సమ్మేళనాలు రక్తపోటును నియంత్రించేందుకు కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. పచ్చి ఉల్లిపాయల్లో పుష్కలంగా సల్ఫర్ ఉంటుంది.. కాబట్టి రక్తపోటును నియంత్రించి గుండెను శక్తివంతంగా తయారు చేస్తుంది.
ఉల్లిపాయల్లో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచే లక్షణాలు ఉంటాయి. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్న వారు, ఇన్సులిన్ నిరోధకత ఉన్నవారు, రోజూ పచ్చి ఉల్లిపాయను తింటే ఆ సమస్య నుంచి బయటపడతారు.
ఉల్లిపాయలు ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో కాల్షియం అధికంగా ఉంటుంది. సల్ఫర్, క్వెర్సెటిన్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఆర్థరైటిస్ వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి.