కన్నప్ప, కుబేర చిత్రాలు వారం రోజుల వ్యవధిలోనే ఆడియన్స్ ముందుకు రాగా, ఈ రెండూ మంచి కలెక్షన్లు రాబట్టాయి. విడుదలైన మొదటి మూడు రోజుల స్క్రీనింగ్‌తో పోల్చి చూస్తే, కుబేర సినిమా రూ. 48.6 కోట్లు వసూలు చేయగా, కన్నప్ప రూ. 23.75 కోట్లు రాబట్టింది. దీంతో ఇండస్ట్రీ ప్రముఖులంతా ప్రస్తుతం కన్నప్ప టీమ్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న వేళ… మంచు విష్ణు తన సినిమాపై కుట్ర జరుగుతోందంటూ షాకింగ్ ట్వీట్ చేశాడు. తన మూవీని కొందరు పైరసీ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నాడు. ‘దయచేసి కన్నప్పను పైరసీ చేయకండి. కన్నప్ప సినిమాను అనధికారికంగా పైరసీ చేసిన 30వేలకు పైగా లింకులను మా టీమ్ తొలగించింది. అయినా ఇంకా లింకులు వస్తూనే ఉన్నాయి. ఇలా పైరసీ చేయడం కూడా దొంగతనమే అవుతుంది. మన ఇంట్లో పిల్లలను దొంగతనం చేయమని చెబుతామా.. ఇలా పైరసీ చేయడం దొంగతనం కిందకే వస్తుంది. కన్నప్పను పైరసీ చేయొద్దు. థియేటర్లలో చూసి ఆదరించండి. కన్నప్ప లాంటి గొప్ప కథను థియేటర్లలో చూసి ఆదరించండి’ అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చాడు మంచు విష్ణు.
మరిన్నివీడియోల కోసం :