Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

స్ట్రీట్ స్టైల్ స్నాక్ రెసిపీ మీకోసం.. ఇంట్లోనే ఇలా ఈజీగా రుచికరంగా చేయండి..!

1 July 2025

Squid Game Season 3: అబ్బే..! ఈ సీజన్‌లో మజా లేదు

1 July 2025

Keerthy Suresh: కథ డిమాండ్‌ చేస్తే.. దానితో నాకు పని లేదు.. ఓపెన్‌ సీక్రెట్‌ చెప్పిన కీర్తి

1 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»4th Class Student Guntur Collector Office,Guntur 4th Class Student: అమ్మ కోసం బుడ్డోడి ప్రయత్నం.. కలెక్టర్‌నే కదిలించింది.. – class 4 student request for mother tiffin stall permission at guntur collector office resolved
ఆంధ్రప్రదేశ్

4th Class Student Guntur Collector Office,Guntur 4th Class Student: అమ్మ కోసం బుడ్డోడి ప్రయత్నం.. కలెక్టర్‌నే కదిలించింది.. – class 4 student request for mother tiffin stall permission at guntur collector office resolved

.By .1 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
4th Class Student Guntur Collector Office,Guntur 4th Class Student: అమ్మ కోసం బుడ్డోడి ప్రయత్నం.. కలెక్టర్‌నే కదిలించింది.. – class 4 student request for mother tiffin stall permission at guntur collector office resolved
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


అమ్మ కోసం ఓ పదేళ్ల బాలుడి తపన కలెక్టర్‌ను కదిలించింది. గంటల్లోనే ఆ కుటుంబం కష్టాన్ని తొలిగించేలా చేసింది. ఈ ఘటన గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో చోటుచేసుకుంది. గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యశ్వంత్ అనే నాలుగో తరగతి బాలుడు కలెక్టర్ కార్యాలయానికి వచ్చాడు. తమ టఫిన్ బండిని అధికారులు తీసివేశారని.. దీంతో అమ్మ చనిపోదామంటోందంటూ ఆ చిన్నారి తన కుటుంబం కష్టం చెప్పుకొచ్చాడు. దీంతో స్పందించిన కలెక్టర్ టిఫిన్ బండి పెట్టుకోవడానికి వారికి స్థలం కేటాయించారు.

గుంటూరు కలెక్టర్ నాలుగో తరగతి విద్యార్థి
గుంటూరు కలెక్టర్ నాలుగో తరగతి విద్యార్థి (ఫోటోలు– Samayam Telugu)

అమ్మ కోసం ఓ పదేళ్ల బాలుడు చేసిన ప్రయత్నం ఫలించింది. ఆ నాలుగో తరగతి బుడ్డోడు ధైర్యంగా వేసిన ఒక్క అడుగు.. తల్లి కళ్లల్లో ఆనందం నింపింది. నిస్సాయ స్థితిలో చచ్చిపోదాం అంటూ ఆ అమ్మ నోటి నుంచి వచ్చిన మాటకు తల్లడిల్లిపోయి ఏదో ఒకటి చేయాలన్న కొడుకు తపన.. కూలిపోయిన వారి జీవనాధారాన్ని మళ్లీ నిలబెట్టింది. చిన్నారి ఇచ్చిన ఒక్క అర్జీతో.. కుటుంబాన్ని కమ్ముకున్న నిరాశ దూరమై.. మళ్లీ బతుకు బండినిలాగే ఆత్మస్థైర్యం దొరికింది.

సోమవారం రోజున గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి యశ్వంత్ అనే నాలుగో తరగతి బాలుడు రావటం అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. జీజీహెచ్ దగ్గర తన తల్లి నడిపే టిఫిన్ బండిని కొందరు అధికారులు తొలగించి కాలువలో పడేశారని.. ఎన్ని సార్లు ఆఫీసులకు తిరిగినా, ఎంత మందిని కలిసినా పట్టించుకోవటం లేదని.. ఉన్న ఒక్క జీవనాధారం కోల్పోయిన బాధలో తన తల్లి చచ్చిపోదాం అంటోదంటూ యశ్వంత్ చెప్పిన మాటలు అందరినీ కదిలించాయి.

తల్లి గురించి ఆ చిన్నారి పడుతున్న తపన, ధైర్యంగా చేసిన ప్రయత్నం తెలుసుకుని కలెక్టర్‌ నాగలక్ష్మి చలించిపోయారు. వెంటనే యశ్వంత్‌ను పిలిపించుకుని సమస్య గురించి తెలుసుకున్నారు. బాలుడు ఇచ్చిన ఫిర్యాదుపై గంటల వ్యవధిలోనే స్పందించి.. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వారి ఏకైక జీవనాధారమైన టిఫిన్ బండిని.. మళ్లీ అదే స్థానంలో పెట్టుకునేందుకు అనుమతించాలని.. అధికారులకు కలెక్టర్ నాగలక్ష్మి సూచించారు. దీంతో.. అధికారులు వెంటనే రంగంలోకి దిగి తొలగించిన బండిని మళ్లీ యశ్వంత్ తల్లికి అప్పగించారు. తన కొడుకు చేసిన ప్రయత్నం ఫలించి.. మళ్లీ టిఫిన్ బండి పెట్టుకునేందుకు అధికారులు అనుమతించటంతో ఆ తల్లి కళ్లలో ఆనందం నిండింది. తమకు న్యాయం చేసిన అధికారులకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు.

అమ్మ బాధ చూడలేక ఆ నాలుగో తరగతి పిల్లాడు చేసిన ప్రయత్నం ఫలించటంతో.. కేవలం ఆ తల్లి కళ్లలోనే కాదు ఈ విషయం తెలిసి కదిలిపోయిన ప్రతీ మనసు ఆనందంతో నిండిపోయింది. శెభాష్ యశ్వంత్‌.. ఆ తల్లి దృష్టిలో నువ్వు రియల్ హీరో.. రియల్ రాఖీ భాయ్.. అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

ఏం జరిగిందంటే..

సోమవారం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి భుజానికి స్కూలు బ్యాగ్‌తో, చేతిలో పేపర్‌తో యశ్వంత్ అనే ఓ పదేళ్ల బాలుడు వచ్చాడు. తన పేరు యశ్వంత్ అని.. తాను నాలుగో తరగతి చదువుతున్నానని అక్కడున్న మీడియాతో తన వివరాలు పంచుకున్నాడు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద తన అమ్మ టిఫన్ బండి పెట్టుకుందని.. అయితే కొంతమంది అధికారులు టిఫిన్ బండిని తీసేశారని.. కాలువలో పడేశారంటూ తన బాధ చెప్పుకున్నాడు.

అధికారులను కలిసినా స్పందించలేదని.. దీంతో తన అమ్మ చచ్చిపోదామంటోందని..అందుకే ఇక్కడికి వచ్చానని బాధ చెప్పుకున్నాడు. కలెక్టర్‌ను కలిసి టిఫిన్ బండి పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వాలని అడగాలని వచ్చినట్లు చెప్పుకొచ్చాడు. ఈ ఘటన మీడియాలో హైలెట్ కాగా.. అధికారులు వెంటనే స్పందించి.. యశ్వంత్ కుటుంబం టిఫిన్ బండి పెట్టుకోవడానికి స్థలం కేటాయించారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి