ఉమ్మడి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ కు చెందిన మమత, పెద్దపల్లి జిల్లా ఎన్ టి పీసీ ప్రగతినగర్ కు చెందిన అనుష. ఇందిరానగర్ లోని ఓ డైరీలో పనిచేస్తున్నారు. వీరిద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరి అత్తమామలు భర్తల నుంచి అదునపు కట్నం కోసం వేధింపులు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు పెద్దలతో పంచాయితీ పెట్టిన మార్పు రాకపోవడంతో రోజురోజుకు వారి వేధింపులు ఎక్కువవడంతో విసిగిపోయిన ఇద్దరూ ఒకరి బాధలు ఒకరికి చెప్పుకొని ఓదార్చుకున్నారు. ఇద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు ఓ నిర్ణయానికి వచ్చారు. జూన్ 23న వేరువేరు చోట్ల ఇద్దరూ పురుగుల మందు తాగేశారు. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ జూన్ 26న ఇద్దరూ మృతి చెందారు. ఈ ఊహించని ఆత్మహత్యలు, మృతుల కుటుంబ సభ్యులను తోటి ఉద్యోగులను తీవ్రంగా కలచివేసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
మరిన్నివీడియోల కోసం :
ఫ్యాన్స్‌కు రష్మిక అదిరిపోయే ఆఫర్..ఆ ఒక్కపని చేస్తే లుస్తానంటూ పోస్ట్
డబ్బుల కోసం పోస్టాఫీసుకి పోతే.. పాస్‌బుక్‌పై ఉన్నది చూడగా వీడియో
చిరుతలనే పరుగులు పెట్టించిన ఎద్దు వీడియో వైరల్