మీరు హాయిగా మీ వంటగదికి వెళుతున్నప్పుడు అకస్మాత్తుగా మీ ఫ్రిజ్ వెనుక నుండి ఒక వింత శబ్దం వినిస్తే ఎలా ఉంటుంది. కంగారు పడిపోతుంటారు. ఆ ఫ్రిజ్ వెనుక దాక్కుంది అసలైన అతిథి. దానిని చూస్తే ఎంతటి ధైర్యవంతులైనా ముచ్చెమటలు పట్టాల్సిందే. ప్రస్తుతం ఈ భయంకర వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక అసలు విషయానికొస్తే.. భారతదేశంలోని అత్యంత విషపూరితమైన పాము కామన్ క్రైట్. ఈ విషపూరితమైన పాము ఇంటి ఫ్రిజ్ వెనుక దాక్కుని ఉండటం కనిపించింది.
ఇంట్లో రిఫ్రిజిరేటర్ వెనుక ఒక ప్రాణాంతకమైన పాము దాక్కుని ఉన్న సంఘటన సినిమా సన్నివేశంలా అనిపించవచ్చు. కానీ ఇది నిజమే. వైరల్ వీడియోలో ఇంట్లో ఉన్న వ్యక్తులు రిఫ్రిజిరేటర్ చుట్టూ నుండి భయానక శబ్దాలు నిరంతరం వింటున్నారట. కానీ ఇంటి సభ్యులు మొదట ఆ శబ్దాలను పెద్దగా పట్టించుకోలేదట. కానీ శబ్దాలు పెరగడం ప్రారంభించినప్పుడు అనుమానం వచ్చి చూడగా, ఇంకేముంది రిఫ్రిజిరేటర్‌ను గోడ నుండి కొంచెం కదిలించి వెనుకకు చూసినప్పుడు వారికి వణుకు పుట్టింది. వెంటనే ఇంట్లో ఉన్న ఆ మహిళ పెద్దగా కేకలు వేసింది. భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన పాము ఇది. సకాలంలో చికిత్స చేయకపోతే ఒక వ్యక్తి కొన్ని నిమిషాల్లో చనిపోయే ప్రమాదం ఉంటుందన్నారు నిపుణులు. కానీ ఈ పాము ప్రశాంతంగా ఫ్రిజ్ వెనుకాల ఉంది. అది ఎప్పుడు యాక్టివ్ అవుతుందో ఎవరికీ తెలియదు.
ఇవి కూడా చదవండి
స్నాక్ క్యాచర్‌కు ఫోన్..
భయపడిన కుటుంబం వెంటనే స్థానిక పాములు పట్టే వ్యక్తికి ఫోన్ చేసింది. వెంటనే నిపుణుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. పాములు పట్టే వ్యక్తి చాలా జాగ్రత్తగా రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాడు. పామును రిఫ్రిజిరేటర్ వెనుక నుండి నెమ్మదిగా బయటకు తీశారు. పామును బయటకు తీసిన వెంటనే దాని పొడవును చూసి జనాలు భయపడిపోయారు.
ఈ వీడియోను adilmirzasnake అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి షేర్ చేయగా, ఇప్పటివరకు లక్షలాది మందికిపైగా వీక్షించారు. చాలా మంది ఈ వీడియోను లైక్ చేశారు. సోషల్ మీడియా వినియోగదారులు కూడా వీడియోకు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఈ పాము చాలా ప్రశాంతంగా ఉంటుంది, అందుకే దీనిని నిశ్శబ్ద కిల్లర్ అని పిలుస్తారు. ఈ సంఘటన ఎక్కడో తెలియదు కానీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.