Andhra Pradesh Tribal Gurukulams Guest Faculty Salaries Hike: ఆంధ్రప్రదేశ్‌లోని గిరిజన గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న 1,659 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు పెంచుతూ శుభవార్త చెప్పింది. జూనియర్ లెక్చరర్ల నుంచి పీఈటీల వరకు వేతనాలు పెరిగాయి. దీనికి సంబంధించి గిరిజన సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు, పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం స్టడీ అవర్స్‌ను ప్రభుత్వం ప్రారంభించనుంది. దీనిని ఎంఈవోలు పర్యవేక్షిస్తారు. మొక్కలు నాటి పెంచిన విద్యార్థులకు ధ్రువపత్రాలు ఇస్తారు.

‘గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో పనిచేసే జేఎల్స్, పీడీ(సీ), లైబ్రేరియన్లకు రూ.6,150.. పీజీటీలకు రూ.8,050, టీజీటీ, పీడీ(ఎస్)లకు రూ.4,550.. పీఈటీ, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ ఉపాధ్యాయులకు రూ.5,450’ చొప్పున జీతాలు పెంచినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే పీజీటీలకు రూ.6,250.. చొప్పున అరకు వ్యాలీలోని స్పోర్ట్స్ స్కూల్‌లో పనిచేసే కోచ్‌కు రూ.6,250, అసిస్టెంట్ కోచ్‌లకు రూ.5,500 చొప్పున జీతం పెంచారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో చాలామంది సిబ్బందికి మేలు జరుగుతుంది. జీతాల పెంపుపై ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు.
ఒలింపిక్స్‌లో యోగా.. మోదీ తలచుకుంటే ఏదైనా సాధ్యమే: చంద్రబాబు
నేటి నుంచే పదో విద్యార్థులకు ‘స్టడీ అవర్’
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదో తరగతి విద్యార్థులకు స్టడీ అవర్ అమలు చేయనుంది. ప్రతి రోజూ సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఈ స్టడీ అవర్ నిర్వహిస్తారు. నేటి నుంచిఈ కార్యక్రమం ప్రారంభంకానుంది.. అయితే ఈ స్టడీ అవర్‌ను పర్యవేక్షించందుకు.. ఎంఈవోలు రోజుకో బడికితప్పనిసరిగా సందర్శించి రిపోర్ట్ ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ‘ఎంఈవో, సీఆర్టీలు ఉదయం 9 గంటల కల్లా కార్యాలయంలో ఉండాలని.. జులై మూడో వారంలో స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు, ఆగస్టు 4 నుంచి ఫార్మెటివ్-1 పరీక్షలు నిర్వహించాలి’ అని సూచించారు. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే విద్యార్థులు మొక్కలు నాటి నాలుగేళ్లపాటు పెంచుతారో.. వారికి ధ్రువపత్రాలు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ తెలియజేసింది.