Andhra Pradesh Weather Today: ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో ఈదురుగాలులతో కూడిన వర్షాలకు రైతులు పంట నష్టపోయారు. అధికారులు అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టారు.
హైలైట్:
- ఏపీకి వాతావరణశాఖ బిగ్ అలర్ట్
- అల్పపీడనం ప్రభావంతో వర్షాలు
- ఈ జిల్లాల్లో మూడ్రోజులు వానలు

Saraswati Sugar Mill: కొంపముంచిన వర్షం.. కరిగిపోయిన కోట్ల విలువైన చక్కెర!
ఏలూరు జిల్లా వేలేరుపాడులో 40 మిల్లీ మీటర్లు, విశాఖపట్నం జిల్లా భీమిలిలో 36.8, ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో 32.8, విశాఖపట్నంలో 29.6, ఏలూరు జిల్లా కుక్కునూరులో 28.4, అనకాపల్లిలో 28.4, ఏలూరు జిల్లా చింతలపూడిలో 27.2, విజయనగరంలో 22.4, అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో 22.2, విజయనగరం జిల్లా తెర్లాంలో 21.2, ఏలూరులో 21, ఏలూరు జిల్లా భీమడోలులో 20.6, ఏలూరు జిల్లా పోలవరంలో 20.04 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు వర్షాలతో అధికారులు అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలో అధికారులతో కలెక్టర్లు సమీక్షలు చేశారు. గోదావరికి వరద నీరు వచ్చి చేరుతుండటంతో ముందస్తు చర్యలపై చర్చించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస చర్యలపై ఫోకస్ పెట్టారు.