ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందింది మేడారం మహా జాతర.. ఈ మేడారం మహా జాతర తేదీలను పూజారుల సంఘం ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31వరకు జాతర జరగనుంది. ఇందులో భాగంగా 28న సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు. 29న సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి గద్దెలకు చేరుకుంటారు. 30న భక్తులు మొక్కులు చెల్లించుకుంటారని, 31న అమ్మవార్ల వనప్రవేశం ఉంటుందని ప్రకటనలో పేర్కొంది. మూడో రోజునే గద్దెలపై కొలువుదీరి ఉన్న సమ్మక్క, సారలమ్మ వనదేవతలు, గోవింద రాజు, పగిడిద్దరాజుల వారి వన ప్రవేశం కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ మేరకు పూజారులు తేదీలను నిర్ణయించారు. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో ఈ జాతర జరగనుంది.