బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ దర్శకులలో నితేష్ తివారీ ఒకరు. ఆయన దర్శకత్వంలో పాన్-ఇండియన్ పౌరాణిక కథా చిత్రంగా రామాయణం రూపొందుతోంది. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ యశ్ రావణుడిగా కనిపించనున్నాడు. అలాగే పంచదరా బొమ్మ కాజల్ అగర్వాల్ మండోదరి పాత్రను పోషించనుందని సమచారం. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుండగా, మొదటి భాగం షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చిత్ర బృందం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్న ఫోటోలు, వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి
రామాయణం చిత్రం పాన్ ఇండియాలోని అన్ని భాషలలో విడుదల కానుంది. ఇది తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ వంటి వివిధ భాషలల్లోనూ తెరకెక్కనుంది. ఈ చిత్రం మొదటి భాగం షూటింగ్ పూర్తయింది మరియు. 2026 లో దీపావళి పండుగ సందర్భంగా రామయాణ్ పార్ట్-1ను విడుదల చేయాలని మేకర్స్. భావిస్తున్నారు. అలాగే ఈ సినిమా రెండవ భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేస్తామని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. ఈ సినిమా మొదటి భాగం షూటింగ్ పూర్తయినందున, ఈ సినిమా గ్లింప్స్ వీడియోను జూలై 3, 2025న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
కేక్ కట్ చేసి సంబరాలు..
Ram and Lakshman during Ramayana wrap up #Ramayana #RanbirKapoor pic.twitter.com/ViXwAKlvqv
— RK (@Varun_RK88) July 1, 2025
Just look at the aura and presence of #Yash – he’s born to play #Raavan!🔥#RanbirKapoor as Shri Ram vs Yash as Raavan , this epic clash could rewrite box office history!#Ramayana Part 1 & 2 coming this Diwali 2026 & 2027 !! pic.twitter.com/F4pTR7A67y
— Sumit Kadel (@SumitkadeI) May 29, 2025
కాగా రామాయణ్ చిత్రంలో యష్ నటించడమే కాక, ప్రైమ్ ఫోకస్ స్టూడియోలతో పాటు తన బ్యానర్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ కింద ఈ సినిమా కు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇక లక్ష్మణుడిగా రవి దూబే, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్, హనుమాన్ గా సన్నీ డియోల్ మరియు దశరథ్‌గా అరుణ్ గోవిల్ తదితర ప్రముఖులు ఈ సినిమాలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.
#Ramayana first part shooting wrap up ..
This is not the end .. this is the beginning.. #RanbirKapoor pic.twitter.com/WXY9qVcMTr
— Krishnematic (@krishnasinghc1) July 1, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..