బటర్ చికెన్ అనేది భారతీయ వంటకాల్లో ప్రసిద్ధి చెందిన, రుచికరమైన వంటకం, ఇది క్రీమీ గ్రేవీ.. స్పైసీ రుచి ఉండడంతో పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. వాస్తవానికి ఈ బటర్ చికెన్ ఇప్పుడు దక్షినాదిలో దొరుకుతున్నా.. ఈ వంటకం ఉత్తర భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. దీనిని సాధారణంగా నాన్, రోటీ లేదా రైస్‌తో వడ్డిస్తారు. బటర్ చికెన్ తయారు చేసే ప్రక్రియ కొంచెం సమయం తీసుకుంటుంది. అయితే ఇది చాలా రుచికరంగా ఉంటుంది. తిన్న తర్వాత బటర్ చికెన్ చేయడానికి పడిన ప్రయత్నమంతా ‘విలువైనది’ అనిపిస్తుంది. ఈ రోజు బటర్ చికెన్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు:
చికెన్: 500 గ్రాములు (ఎముకలు లేకుండా, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయలు: 2 పెద్దవి (సన్నగా తరిగినవి)
ఇవి కూడా చదవండి
టమోటాలు: 4 పెద్దవి (సన్నగా తురిమినవి)
పచ్చిమిర్చి: 2 (సన్నగా తరిగినవి)
పెరుగు: 1 కప్పు
వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్
అల్లం పేస్ట్: 1 టేబుల్ స్పూన్
కాశ్మీరీ ఎర్ర కారం: 1 టేబుల్ స్పూన్
ధనియాల పొడి: 1 టేబుల్ స్పూన్
గరం మసాలా పొడి: 1 టీస్పూన్
ఉప్పు: రుచికి తగినంత
వెన్న: 3-4 టేబుల్ స్పూన్లు
నూనె: 2 టేబుల్ స్పూన్లు
జీడిపప్పు పేస్ట్: 2 టేబుల్ స్పూన్లు
ఫ్రెష్ క్రీం: 1/2 కప్పు
కొత్తిమీర: అలంకరించడానికి
తయారీ విధానం:
ముందుగా చికెన్ ముక్కలను బాగా కడిగి శుభ్రం చేసుకుని ఒక గిన్నెలో చికెన్ ముక్కలు వేసి ఆపి పెరుగు, వెల్లుల్లి పేస్ట్, అల్లం పేస్ట్, కాశ్మీరీ ఎర్ర కారం,ధనియాల పొడి, గరం మసాలా పొడి , కొంచెం ఉప్పు వేసి బాగా కలపండి.
ఈ మిశ్రమాన్ని చికెన్ ముక్కలకు బాగా పట్టించి మ్యారినేట్ చేసిన చికెన్ ను 2 గంటలు ఫ్రిజ్‌లో పెట్టండి. ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ చేసుకుని పక్కకు పెట్టుకోండి.
తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్‌ను గ్రిల్ చేయండి. లేదా పాన్ మీద కొద్దిగా నూనె వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు ఒక పాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టి పాన్ లో వెన్న వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. తర్వాత టమాటాలు వేసి బాగా వేయించాలి. టమాటాలు పూర్తిగా ఉడికి నూనె వేరు అవ్వడం ప్రారంభించిన తర్వాత జీడిపప్పు పేస్ట్ వేసి కలపండి.
కొంచెం సేపు ఉడికించిన తర్వాత గ్రేవీ రెడీ అవుతుంది. ఇప్పుడు గ్రేవీని చల్లారనిచ్చి, తర్వాత దీనిని బ్లెండర్‌లో వేసి మెత్తని పేస్ట్‌లా చేయండి.
మళ్ళీ పాన్ ని స్టవ్ మీద పెట్టి వేడి చేసి పాన్ లో మళ్ళీ కొంచెం వెన్న వేడి చేసి, బ్లెండ్ చేసిన పేస్ట్ వేసి.., తాజా క్రీమ్, పచ్చిమిర్చి, ఉప్పు వేసి బాగా కలపండి. ఈ గ్రేవీని 5-7 నిమిషాలు ఉడికించాలి.
గ్రేవీలో గ్రిల్డ్ చికెన్ ముక్కలను వేసి బాగా కలపండి. తక్కువ మంట మీద 5 నిమిషాల సేపు చికెన్ ను ఉడికించండి.
చివరిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం క్రీమ్ తో వేసి అలంకరించండి. అంతే బటర్ చికెన్ ను రెడీ అయినట్లే.
దీనిని వేడి నాన్, రోటీ లేదా అన్నంతో బటర్ చికెన్ వడ్డించండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..