రేణిగుంట సినిమా గుర్తుందా.. ? 2009లో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగుతోపాటు తమిళంలో అడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రంతో ఫేమస్ అయ్యింది నటి సనుష. అంతకు ముందే తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ వంటి అనేక భాషల్లో నటించింది.ప్రస్తుతం ఆమె లేటేస్ట్ ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. కేరళకు చెందిన సనుష 2000లో రిలీజ్ అయిన దాదా సాహెబ్ చిత్రంతో బాలనటిగా సినిమాల్లోకి అడుగుపెట్టింది. అలాగే విక్రమ్ నటించిన కాశి సినిమాతో తమిళంలోకి తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత సుందర ట్రావెల్స్, భీమ, రేణికుంట, నాలై నమడే, ఏతాన్ వంటి చిత్రాల్లో నటించింది. ఇక తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బంగారం సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా మెరిసింది. తక్కువ సమయంలోనే తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న సనూష.. చివరగా మలయాళంలో జలధర పంప్ సెట్ సిన్స్ 1962 చిత్రంలో కనిపించింది. ఈ మూవీ 2023లో విడుదలైంది.
ఆ తర్వాత ఆమె మరో సినిమా చేయలేదు. చదువుల కోసం సినిమాలకు దూరమయ్యారు. కొన్ని రోజుల క్రితమే గ్రాడ్యూయేషన్ పట్ట అందుకున్నారు. సనూష సంతోషం ప్రస్తుతం స్కాట్లాండ్‌లో చదువుతూ గ్రాడ్యుయేషన్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది సనూష. ఇంటి నుంచి దూరంగా ఉండి.. ఎన్నో కన్నీళ్లు.. నిద్రలేని రాత్రులు.. అనేక పార్ట్ టైమ్ ఉద్యోగాలు… ఫుల్ టైమ్ జాబ్స్, కష్టపడి పనిచేయడం.. ఆరోగ్య సమస్యలు.. ఒత్తిడి ఎన్నో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసేందుకు ప్రతిఫలంగా నిలిచాయని సనూష రాసుకొచ్చింది.
ఇవి కూడా చదవండి
ప్రస్తుతం నసూష లేటేస్ట్ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. నిత్యం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు.. రెగ్యులర్ ఫోటోస్, వీడియోస్ అప్లోడ్ చేస్తూ నెటిజన్లకు దగ్గరగా ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన గ్రాడ్యుయేషన్ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.
ఇవి కూడా చదవండి :
Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..
Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..
Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..
Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..