విడా VX2: సరసమైన ధరకు కొనాలనుకునే వ్యక్తుల కోసమే ఈ స్కూటర్. కేవలం ₹70,000 నుంచి ₹1.05 లక్షలు ధరలో దొరికే EV స్కూటర్ ఇది. ఇది VX2 Go, VX2 ప్లస్, VX2 ప్రోవేరియంట్లులో లబిస్తుంది. ఇది 1 జులై 2025న లాంచ్ అయింది. VX2 Go బ్యాటరీ 2.2 kWh బ్యాటరీతో వస్తుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 92 కి.మీ.లు ప్రయాణిస్తుంది. అయితే VX2 ప్లస్ బ్యాటరీ 3.4 kWh బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 142 కి.మీ.లు ప్రయాణిస్తుంది.
గోగోరో క్రాస్ఓవర్: ఇది సాధారణ నగర స్కూటర్ కంటే భిన్నమైనది. ఇది వివిధ రకాల రహదారి పరిస్థితులకు అనుగుణంగా నిర్మించబడింది. ఇది డిసెంబర్ 2025లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర ₹1.20 లక్షలు. ఒక సారి ఛార్జ్ చేస్తే 150 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. దీని స్పీడ్ లిమిట్ 60+ కి.మీ/గం. దీని మోటార్ పవర్ 2.5 kW డైరెక్ట్ డ్రైవ్ (GX250) . కెర్బ్ బరువు 122 కి.గ్రా. ఇది సెప్టెంబర్ 2025లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
సుజుకి బర్గ్‌మ్యాన్ ఎలక్ట్రిక్: మీరు ఎప్పుడైనా బర్గ్‌మ్యాన్ పెట్రోల్ వెర్షన్‌ను ఉపయాగించి ఉంటె అది సౌకర్యం సున్నితమైన ప్రయాణాల కోసం నిర్మించబడిందని మీకు అర్ధమవుతుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర ₹1.20 లక్షలు. ఒక సారి ఛార్జ్ చేస్తే 90 కి.మీ వరకు వెళ్ళవచ్చు. దీని స్పీడ్ లిమిట్ 30 కి.మీ/గం. 4 kW పీక్ అంటే 110సీసీ మోటార్ పవర్. ఇది సెప్టెంబర్ 2025లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
గోగోరో 2 సిరీస్: ఇది టెక్ ప్రియుల కోసం తయారు చేయబడింది. గోగోరో బ్యాటరీ-మార్పిడి సాంకేతికతకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. మీరు దానిని ప్లగ్ చేయవలసిన అవసరం కూడా లేదు. స్వాప్ స్టేషన్‌లో ఛార్జ్ చేసిన బ్యాటరీని చేంజ్ చేసుకోవచ్చు. లిథియం-అయాన్ బాటరీ కలిగి ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర ₹1.50 లక్షలు. ఒక సారి ఛార్జ్ చేస్తే 170 కి.మీ వరకు వెళ్ళవచ్చు. దీని స్పీడ్ లిమిట్ 30 కి.మీ/గం. 7 kW పీక్, వెనుక భాగంలో 196 Nm టార్క్ ప్రొడ్యూజ్ చేస్తుంది. లిథియం-అయాన్. కెర్బ్ బరువు 122 కి.గ్రా ఉంటుంది. ఇది సెప్టెంబర్ 2025లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
వెస్పా ఎలక్ట్రిక్ స్కూటర్: వెస్పా పెట్రోల్ స్కూటీకి మంచి రివ్యూస్ అందుకుంది. ఇప్పుడు క్లీన్ ఎనర్జీతో నడిచే అదే క్లాసిక్ ఆకర్షణతో కొత్త ఎలక్ట్రిక్ వెర్షన్‌ను లాంచ్ చేయడానికి సిద్ధం అవుతుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర ₹1.70 లక్షలు. ఒక సారి ఛార్జ్ చేస్తే 100 కి.మీ వరకు ప్రయాణం చేయవచ్చు. ఇది ఫుల్ ఛార్జ్ కోసం దాదాపు 3.5 గంటలు సమయం తీసుకుంటుంది. దీని స్పీడ్ లిమిట్ 70 కి.మీ/గం. 4 kW పీక్ అంటే 110సీసీ మోటార్ పవర్. ఇది మార్చి 2026 నుంచి మార్కెట్లో అందుబాటులో ఉండనుంది.