సాధారణంగా థియేటర్లలో విడుదలైన నెల రోజుల తర్వాతే సినిమాలు ఓటీటీలోకి వస్తాయి. సూపర్ హిట్ సినిమాల విషయంలో ఈ టైమ్ కాస్త ఎక్కువ కావొచ్చు. అయితే సినిమా అయినా వెబ్ సిరీస్ అయినా స్ట్రీమింగ్ చేయడానికి సంబంధిత ఓటీటీ ప్లాట్ ఫామ్ దగ్గర ఓ నిర్దిష్ట గడువు ఉంటుంది. ఈ గడువు ముగిసిన వెంటనే సదరు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆ సినిమాను తమ స్ట్రీమింగ్ లిస్ట్ నుంచి కచ్చితంగా తొలగించాలి. దీనికి సంబంధించి ఓటీటీ సంస్థలు, సినిమా నిర్మాతలు ముందే డీల్ కుదర్చుకుంటారు.దీంతో పాటు, సినిమాకు డిమాండ్ తగ్గిన వెంటనే, లేదా కొత్త కంటెంట్‌కు చోటు కల్పించడానికి, లేదా నిర్మాత, పంపిణీదారు మధ్య ఒప్పందం మారిన తర్వాత, లేదా ఏవైనా చట్టపరమైన సమస్యల కారణంగా OTT నుంచి సినిమాలు/ వెబ్ సిరీస్ లను తొలగించే అవకాశముంది.
ఈ నిబంధనలు, నియమాల కారణంగా ఆగస్టు 01 తర్వాత కొన్ని సూపర్ హిట్ సినిమాలో ఓటీటీల నుంచి మాయం కానున్నాయి. మరి అవేంటో తెలుసుకుని చూసేద్దాం రండి..
- బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ చిత్రం ‘రాజీ’. ఈ మూవీ ఆగస్టు 5 వరకు మాత్రమే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత మీరు ఈ చిత్రాన్ని ఓటీటీలో చూడలేరు.
- అక్షయ్ కుమార్ సినిమా ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ కూడా ఈ జాబితాలో ఉంది. ఆగస్టు 1వ తేదీకి ముందు మీరు ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో చూడాలి. ఆ తర్వాత ఆ సినిమా ఓటీటీ నుండి తీసివేయనున్నారు.
- అజయ్ దేవగన్, శ్రియ జంటగా నటించిన ‘దృశ్యం’ (హిందీ) సినిమా చాలా మందికి ఫేవరెట్. ఆగస్టు 1 తర్వాత మీరు ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో చూడలేరు.
అమితాబ్ బచ్చన్, రిషి కపూర్ నటించిన ‘102 నాటౌట్’ చిత్రాన్ని కూడా ఆగస్టు 8లోపే చూడాలి, ఎందుకంటే ఆ తర్వాత అది అమెజాన్ ప్రైమ్ వీడియో OTT ప్లాట్‌ఫామ్ నుండి డిలీట్ కానుంది. - బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్ నటించిన ‘క్వీన్’ చిత్రం 2013లో థియేటర్లలో విడుదలైంది. ఆ తరువాత దీనిని నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేశారు. అయితే, ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో కూడా ఆగస్టు 1 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
- వీటితో పాటు మరికొన్ని హిందీ, తెలుగు సినిమాలు కూడా ఆగస్టు 01 తర్వాత ఓటీటీల్లో కనిపించకపోవచ్చని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..