ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మహానంది మండలం బొల్లవర గ్రామ శివారులోని పొలంలో కొండచిలువ హల్ చల్ చేసింది. పొలంలో కూలీపనులు చేస్తున్న వారిపైకి దూసుకొచ్చిన 15 అడుగుల కొండచిలువ వారిని భయభ్రాంతులకు గురిచేసింది. అంత పెద్ద కొండచిలువను చూసిన వ్యవసాయ కూలీలు పొలంలోంచి బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో మహానంది మండలం అయ్యాలూరుకు చెందిన స్నాక్ స్నాచర్ మోహన్‌కు పొలం యజమాని సమాచారం ఇచ్చారు. సమాచారంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ కొండచిలువను పట్టుకోడానికి రంగంలోకి దిగాడు.
అయితే ఆ 15 అడుగుల కొండచిలువ స్నేక్ స్నాచర్‌కు సైతం చుక్కలు చూపించింది. చాలా సేపు దొరక్కకుండా స్నేక్ క్యాచర్‌ను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. దాదాపు గంటసేపటి తర్వాత తీవ్రంగా శ్రమించిన స్నేక్ స్నాచర్‌కు కొండచిలువ దొరికింది. దీంతో దాన్ని పకడ్బంధీగా బంధించాడు స్నేక్ క్యాచర్.
వైరల్ వీడియో చూడండి..
దాదాపు 15 అడుగులు ఉన్న కొండచిలువను చూసిన వ్యవసాయ కూలీలు,గ్రామస్తులు భయాందోళనకు గురైయ్యారు. కొండచిలువను బందించే దృశ్యాలను కొందరు సెల్ ఫొన్లలో చిత్రీకరించారు. వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. గంటపాటు శ్రమించి పట్టుకున్న కొండచిలువను బొల్లవరం గ్రామం దగ్గరలో ఉన్న నల్లమల అడవిలో వదిలిపెట్టాడు స్నేక్ క్యాచర్ .దీంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..