Rishabh Pant Smashes Helmet In Frustration: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ఆవేశానికి లోనయ్యాడు. ఇంగ్లాండ్ యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ బౌలింగ్‌లో అనూహ్యంగా ఔటైన పంత్, డ్రెస్సింగ్ రూమ్‌కు తిరిగి వెళ్లే సమయంలో తన హెల్మెట్‌ను నేలకేసి కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ రెండో రోజు ఆటలో పంత్ వికెట్ పడిన తీరు క్రికెట్ అభిమానులను, విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. దూకుడుగా ఆడే పంత్, బషీర్ వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే, సరైన టైమింగ్ దొరకకపోవడంతో బంతి లాంగ్-ఆన్‌లో ఫీల్డర్ జాక్ క్రాలీ చేతిలో పడింది.
ఔటైన తర్వాత పంత్ తీవ్ర నిరాశకు లోనైనట్లు స్పష్టంగా కనిపించింది. క్రీజు నుంచి బయలుదేరినప్పటి నుంచే అతను తనపై తాను ఆగ్రహం వ్యక్తం చేసుకుంటున్నట్లు గమనించారు. డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకున్న వెంటనే, తన ఆగ్రహాన్ని నియంత్రించుకోలేక హెల్మెట్‌ను నేలకేసి కొట్టాడు. ఈ దృశ్యం కెమెరాల్లో స్పష్టంగా రికార్డు అయింది.
— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) July 2, 2025
రిషబ్ పంత్ ఆవేశపూరిత స్వభావం గురించి తెలిసినప్పటికీ, ఈ సంఘటన అభిమానులను ఆశ్చర్యపరిచింది. కొంతమంది పంత్ దూకుడు ఆటకు మద్దతుగా నిలవగా, మరికొందరు టెస్టు క్రికెట్‌లో కీలక సమయంలో సీనియర్ ఆటగాళ్లు మరింత బాధ్యతగా ఆడాలని అభిప్రాయపడుతున్నారు.
Pant holes out to Zak Crawley at long-on!
“Cheerio, cheerio, cheerio” shouts The Hollies 👋
🇮🇳 2️⃣0️⃣8️⃣-4️⃣ pic.twitter.com/qM8ZoX8ZwI
— England Cricket (@englandcricket) July 2, 2025
ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో సెంచరీలతో అదరగొట్టిన పంత్, ఈ మ్యాచ్‌లో మాత్రం కేవలం 25 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. కీలక సమయంలో పంత్ వికెట్ కోల్పోవడం భారత జట్టుకు కొంత నిరాశ కలిగించింది. అయితే, శుభమన్ గిల్ సెంచరీతో రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో పటిష్టమైన స్థితిలో నిలిచింది. పంత్ ఈ విధంగా నిరాశ చెందడం, హెల్మెట్ నేలకేసి కొట్టడంపై క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అతని ఆటతీరుపై ఇది ఎంత ప్రభావం చూపుతుందో చూడాలి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..