
ఏదో ఒక రీజన్‌తో వార్తల్లో ఉంటుంది ఏమాయ చేసావె. ఇప్పుడు మళ్లీ మహేష్‌తో ముడిపడిన టాపిక్‌తో ట్రెండ్ అవుతోంది. ఏమాయ చేసావె కథను మహేష్‌ని దృష్టిలో పెట్టుకుని రాశారట గౌతమ్ వాసుదేవ మీనన్. అంతే కాదు ఇనిషియల్ డ్రాఫ్ట్‌లో మెగాస్టార్ చిరంజీవికి కూడా ప్రామినెంట్ రోల్ ఉందట. చిరంజీవి సెట్‌లో పనిచేసే కుర్రాడి ప్రేమకథగా రాసుకున్నారట గౌతమ్. అయితే కథంతా విన్న మహేష్ మాత్రం.. సారీ సార్.. మన కాంబో అంటే యాక్షన్ సినిమా ఎక్స్ పెక్ట్ చేస్తారు.. ఈ స్టోరీ వద్దు అని సున్నితంగా తిరస్కరించేశారట. దాంతో సీన్‌లోకి శింబు, చైతూ ఎంట్రీ ఇచ్చారు. లేకుంటే మహేష్ – గౌతమ్ కాంబోలో క్లాసిక్ రిజిస్టర్ అయి ఉండేది.. విత్ మెగాస్టార్ ప్రెజెన్స్ . ఈ స్టోరీ తెలియనివారు ఆచార్య లో మిస్ అయిన ఛాన్స్ గురించే మాట్లాడుకుంటారు.
ఆచార్యలో చరణ్ చేసిన రోల్ కోసం ముందు మహేష్‌నే అనుకున్నారు. ‘అంతా అయిపోయింది.. సెట్స్ లో అడుగుపెట్టడమే తరువాయి’ అన ఎదురుచూపులు కనిపించాయి. కానీ ఆఖరి నిమిషంలో వర్కవుట్ కాలేదు ఆ ప్రాజెక్ట్. ప్రస్తుతం ఎస్ ఎస్ ఎంబీ 29తో బిజీగా ఉన్నారు మహేష్. ఇండస్ట్రీలో తన తర్వాత ఆ కుర్చీకి పర్ఫెక్ట్ హీరో హీరో మహేష్ అని మెగాస్టార్ గతంలో చెప్పిన మాటలను మరోసారి గుర్తుచేసుకుంటున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్. ఫ్యూచర్‌లో అయినా ఈ కాంబోకి స్కోప్ ఉందా? అనే చర్చ జరుగుతోంది. మహేష్‌కీ – చిరుకి తగ్గ సబ్జెక్టుతో ఎవరైనా ముందుకెళ్తే ఈ క్రేజీ కాంబోని స్క్రీన్ మీద విట్‌నెస్ చేసేయొచ్చన్నది అందరి మనస్సుల్లోని మాట.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..