ముంబైలో అక్రమ బైక్ టాక్సీలు నడపడం లేదని మహారాష్ట్రకు చెందిన ఒక అధికారి ఇటీవల పేర్కొన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వ రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ ఆ అధికారి వాదనను స్వయంగా పరిశీలించేందుకు రోడ్డెక్కారు. ఈ క్రమంలోనే ఒక యాప్ ద్వారా అక్రమంగా ప్రయాణీకులను బుక్ చేసుకుంటున్న రాపిడో బైక్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ విధంగా, అనుమతి లేకుండా ‘బైక్ యాప్’ నడుపుతున్న సంస్థను రవాణా మంత్రి స్వయంగా బయటపెట్టారు.
అధికారి వాదనలో నిజాన్ని ధృవీకరించడానికి రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ స్వయంగా రాపిడోను ఉపయోగించారు. మంత్రి ప్రతాప్ బైక్ బుక్ చేసుకున్న 10 నిమిషాల్లోనే బైక్ అతన్ని తీసుకెళ్లడానికి వచ్చింది. ఈ సమయంలో, మంత్రి బైక్ రైడర్‌కు రూ. 500 ఛార్జీని అందించి, ముంబైలో బైక్ టాక్సీలు నడపడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. ‘‘నేను రవాణా మంత్రిని’’ అని బైక్ డ్రైవర్‌తో అన్నారు. ముంబైలో బైక్ టాక్సీ చట్టవిరుద్ధం. అయినా బైక్ టాక్సీలు నడపడం తప్పు కదా అని మంత్రి తీవ్రంగా మందలించారు. అయితే, బైక్ డ్రైవర్ మంత్రి నుండి డబ్బు తీసుకోవడానికి నిరాకరించాడు. దీని తర్వాత మంత్రి మాట్లాడుతూ, మీలాంటి పేదవాడిపై కేసు పెట్టడం ద్వారా మేము ఏమీ సాధించబోమని, కానీ దీని వెనుక దాక్కున్న వారిని శిక్షించాలన్నదే మా ఉద్దేశం అని మంత్రి ప్రతాప్ సర్నాయక్ అన్నారు. అనంతరం సదరు బైక్ టాక్సీని అక్కడి నుంచి పంపించి వేశారు.
వీడియో చూడండి..
मंत्रालय येथूनचं ट्रॅप ऑपरेशन – अनधिकृत रॅपिडो बाईक टॅक्सी सेवांवर थेट कारवाई…#PratapSarnaik #TransportMinister#MaharashtraTransport #ActionAgainstIllegalBikeTaxi@rapidobikeapp pic.twitter.com/K81GiHydIb
— Pratap Baburao Sarnaik (@PratapSarnaik) July 2, 2025
మహారాష్ట్రలో పనిచేయడానికి యాప్ ఆధారిత బైక్ అగ్రిగేటర్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అధికారిక అనుమతి ఇవ్వలేదు. ఇటీవల ప్రకటించిన ఈ-బైక్ విధానం ప్రకారం, నిర్దిష్ట ప్రమాణాలను పాటించే కంపెనీలు మాత్రమే ఒక లక్ష కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో సేవలను నిర్వహించడానికి అనుమతించారు. ప్రభుత్వం ఇంకా నిబంధనలను తెలియజేయలేదు. ఇది అటువంటి సేవలను చట్టవిరుద్ధం చేస్తుంది.
అయితే, అక్రమ బైక్ టాక్సీ యాప్‌లు, సేవలు పనిచేస్తున్నాయో లేదో తనిఖీ చేయమని మంత్రి అధికారిని అడిగినప్పుడు, యాప్‌లు-సేవలు పనిచేయడం లేదని అధికారి స్పష్టం చేశారు. ముంబై లేదా ఇతర నగరాల్లో అనధికార బైక్ టాక్సీ యాప్‌లు లేవని ఆయన అధికారిక సమాధానంలో తెలిపారు. దీంతో పరిశీలించేందుకు స్వయంగా మంత్రి ప్రతాప్ సర్నాయక్ రంగంలోకి దిగారు. ఇదిలావుంటే, గత నెలలో, మహారాష్ట్ర రవాణా కమిషనర్ కార్యాలయం రాపిడో, ఉబర్ కంపెనీలపై ఆజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్‌లో అక్రమంగా బైక్ టాక్సీలు నడుపుతున్నందుకు కేసు నమోదు చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..