Team India Cricketer: టీమిండియాలో ఒక బౌలర్ అంతర్జాతీయ క్రికెట్ ఎంట్రీ ఇచ్చిన వెంటనే సంచలనం సృష్టించాడు. కానీ, సెలెక్టర్లు ఆ ఆటగాడిని భారత జట్టు నుంచి బయటకు పంపించేశారు. ఈ బౌలర్ తన ప్రాణాంతక బౌలింగ్ కారణంగా ప్రత్యర్థి బ్యాటర్లకు ప్రాణాంతకంగా మారాడు. చాలా కాలం పాటు భారత జట్టుకు దూరంగా ఉన్న ఈ ఆటగాడు చివరకు మార్చి 2024లో క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించి షాకిచ్చాడు.
అకస్మాత్తుగా భారత జట్టు నుంచి అదృశ్యం..
ఈ క్రికెటర్ ఫిబ్రవరి 2021లో ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత క్రికెట్ జట్టు తరపున తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అక్షర్ పటేల్ టీమ్ ఇండియాలోకి అడుగుపెట్టిన వెంటనే, ఈ క్రికెటర్‌కు భారత టెస్ట్ జట్టు నుంచి దాదాపుగా దూరమయ్యాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 2021లో ఇంగ్లాండ్‌తో జరిగిన ఈ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో అక్షర్ పటేల్ టీమిండియా తరపున తన టెస్ట్ అరంగేట్రం చేశాడు.
ఒక్క దెబ్బతో కెరీర్ ఖతం..
ఈ క్రికెటర్ మరెవరో కాదు ఎడమచేతి వాటం స్పిన్నర్ షాబాజ్ నదీమ్. టీమిండియా తరపున మొత్తం రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన షాబాజ్ నదీమ్.. మొత్తం 8 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా తరపున 35 ఏళ్ల ఎడమచేతి వాటం స్పిన్నర్ షాబాజ్ నదీమ్ 2021 ఫిబ్రవరి 9న చెన్నైలో ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు.
ఫస్ట్ క్లాస్‌లో తోపు..
ఫస్ట్ క్లాస్‌లో షాబాజ్ నదీమ్ రికార్డు చాలా బాగుంది. షాబాజ్ నదీమ్ 140 మ్యాచ్‌ల్లో 28.86 సగటుతో 542 వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్ టీమిండియాలోకి అడుగుపెట్టిన తర్వాత షాబాజ్ నదీమ్ టెస్ట్ కెరీర్ దాదాపు ముగిసింది. అక్షర్ పటేల్ 2021 ఫిబ్రవరి 13న చెన్నైలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌తో అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి అక్షర్ టీమిండియాలో కీలక సభ్యుడిగా మారాడు.
72 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 48 వికెట్లు..
మొత్తం 72 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో షాబాజ్ నదీమ్ 48 వికెట్లు పడగొట్టాడు. షాబాజ్ నదీమ్ 2021 సంవత్సరంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున తన చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. 2019 అక్టోబర్ 19న దక్షిణాఫ్రికాతో జరిగిన రాంచీ టెస్ట్ మ్యాచ్‌లో షాబాజ్ నదీమ్ టీమిండియా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. రాంచీలో దక్షిణాఫ్రికాతో జరిగిన తన తొలి టెస్ట్ మ్యాచ్‌లో షాబాజ్ నదీమ్ 4 వికెట్లు పడగొట్టాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..