Perecherla To Kondamodu National Highway: ఆంధ్రప్రదేశ్‌లో పేరేచర్ల-కొండమోడు హైవేను నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం రూ.881.61 కోట్లు కేటాయించింది. ఈ రహదారి గుంటూరు, హైదరాబాద్ మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. తాజాగా, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానం చేస్తూ మూడు కిలోమీటర్ల మేర రోడ్డును విస్తరించాలని ప్రతిపాదించారు. దీనివల్ల హైదరాబాద్, పల్నాడు నుంచి అమరావతికి వెళ్లేవారికి ప్రయాణం సులభతరం అవుతుంది. ప్రస్తుతం డిజైన్‌లో మార్పులు చేసి ఫిరంగిపురం బైపాస్‌ను వేములూరిపాడు దగ్గర కలపాలని యోచిస్తున్నారు.
హైలైట్:
- ఏపీలో మరో నేషనల్ హైవే అమరావతి ORRకు కనెక్ట్
- సరికొత్తగా మరో ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు
- కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రతిపాదనలు

సీఎం కారులో.. సీఎంతో కలిసి.. దళితుడి ప్రయాణం
అనంతపురం నుంచి అమరావతికి కనెక్టివిటీ కోసం కొత్త నేషనల్ హైవేను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకే గుంటూరు నుంచి కర్నూలు రోడ్డులో ఫిరంగపురం నుంచి బైపాస్ నిర్మాణం చేసి పేరేచర్ల-మేడికొండూరు రోడ్డు మధ్యలో అమరావతి ఓఆర్ఆర్‌లో కలిసేలా (కొండమోడు-పేరేచర్ల మార్గాన్ని క్రాస్ చేస్తూ వెళ్తుంది) ప్లాన్ చేశారు. ఈ మేరకు ఇప్పుడు ఉన్న డిజైన్‌లో మార్పులు చేయాలని సూచనలు చేస్తున్నారు. ఇప్పుడున్న డిజైన్ మార్చేసి.. కొండమోడు-పేరేచర్ల రహదారికి ఫిరంగిపురం నుంచి బైపాస్ మార్గాన్ని వేములూరిపాడు దగ్గర అనుసంధానం చేయడంతో పాటు అక్కడి నుంచి అమరావతి ఓఆర్ఆర్‌పైకి వెళ్లేట్లు ఆలోచన చేస్తున్నారు. ఇలా చేస్తే కొండమోడు-పేరేచర్ల హైవే నుంచి ప్రస్తుతం ప్రతిపాదించిన 3 కిలోమీటర్ల అనుసంధాన మార్గం అవసరం ఉండదని.. భూసేకరణ, రోడ్డు నిర్మాణ భారం ప్రభుత్వంపై తగ్గుతుందని భావిస్తున్నారు. మరి చూడాలి ఈ తాజా ప్రతిపాదనలపై కేంద్రం ఎలా స్పందిస్తుందన్నది చూడాలి.