మనలో చాలా మంది ఉదయాన్నే చాయ్, కాఫీ ఏదో ఒకటి తాగందే బండి కదలదు. అయితే, ఈ మధ్య కాలంలో చాలా మంద బ్లాక్ కాఫీ తాగడం అలవాటుగా మారింది. ఉదయం లేవగానే వేడి వేడిగా బ్లాక్ కాఫీ తాగుతున్నారు. ఉదయాన్నే ఇలా కాఫీ తాగితే నిద్ర మత్తు తొలగిపోతుంది, శరీరానికి తేలికగా అనిపిస్తుంది, ఏకాగ్రత పెరుగుతుంది.. రోజు ఆరంబానికి కావాల్సిన కొత్త ఉత్సహం అందిస్తుందనే నమ్మకంతో చాలా మంది దీనిని తమ డైలీ రొటీన్‌గా మార్చేసుకుంటున్నారు. అయితే, ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా.. ? ఈ విషయంలో ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం…
బ్లాక్ కాఫీలో కెఫీన్ ఉంటుంది. ఇది శరీరానికి శక్తిని పెంచడానికి, ఏకాగ్రతను మెరుగుపరచడానికి తోడ్పడుతుంది. అంతేకాదు.. మానసిక స్థితిని కూడా మెరుగు చేస్తుంది. జీవక్రియను వేగవంతం చేస్తుంది..తద్వారా బరువు తగ్గడానికి కూడా తోడ్పడుతుంది. కానీ, ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగడం వల్ల అసిడిటీ పెరుగుతుంది. శరీరంలో కార్టిసాల్ హార్మోన్‌ను పెంచుతుంది. తద్వారా ఒత్తిడి, మానసిక సమస్యలు తలెత్తుతాయి. ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల చురుకుదనం పోయి వింత భయం కలుగుతుంది. అల్సర్లు వంటి జీర్ణ సమస్యలు ఉన్న వారు దీనికి దూరంగా ఉండాలి.
ఇవి కూడా చదవండి
ఖాళీ కడుపుతో ఈ కాఫీ తాగడం వల్ల కడుపులో పూత, పేగు రుగ్మతలు తలెత్తే ప్రమాదం ఉంటుందని సూచిస్తున్నారు. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత ఎలాంటి టీ, కాఫీ తాగినా ప్రమాదం ఉండదని వైద్యులు చెబుతున్నారు. ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య తలెత్తినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.