అదొక రద్దీ ప్రాంతం. అక్కడ ఒక కేఫ్ ఉంది.. సాయంత్రం కావడంతో కస్టమర్ల హడావుడి ఎక్కువైంది. హాయిగా కాఫీ తాగుతూ ఎవరి ముచ్చట్లలో వారు పడ్డారు. ఇంతలో ఒక్కసారిగా పెద్ద గొడవ మొదలైంది. ఇద్దరు వ్యక్తులు కేఫ్ సిబ్బందిపై దాడికి దిగారు. పిడి గుద్దులు గుద్దుతూ.. తన్నుతూ తీవ్రంగా కొట్టారు. దీనికి సంబంధించిన నెట్టింట వైరల్ గా మారింది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చిన్న కాఫీ పెద్ద గొడవకు కారణమైంది. బెంగళూరులోని శేషాద్రిపురంలో నమ్మ ఫిల్టర్ కాఫీ షాపు చాలా పాపులర్. బుధవారం సాయంత్రం ఈ షాపుకు నలుగురు వ్యక్తులు వెళ్లి కాఫీ తాగారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడే ఓ వివాదం మొదలైంది. కాఫీ పూర్తైన తర్వాత వారిలో ఒకరు మరో కప్పు కాఫీ ఇవ్వాలని సిబ్బందిని అడిగారు. దీనికి సిబ్బంది నిరాకరించారు. పైగా మరో కప్ కొనాలని సూచించారు. దీంతో మాకే ఇంకో కప్పు కాఫీ ఇయ్యవా.. పైగా ఇంకోటి కొనమని చెప్తావా అంటూ సిబ్బంది వారిని తిట్టారు. అంతటితో ఆగకుండా సిబ్బందిపై దాడికి దిగారు. కాఫీ ఇవ్వడానికి నిరాకరించిన వ్యక్తిని బయటకు లాక్కొచ్చి తన్నుతూ, పిడిగుద్దులు కురిపిస్తూ ఇష్టమొచ్చినట్లుగా దాడి చేశారు. ఈ దాడి మొత్తం సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. దాడి చేసిన వారిపై సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
On Camera, Bengaluru Cafe Staff Assaulted Over Extra Coffee Cup – by @dpkBopanna https://t.co/0pYS5eyxHr pic.twitter.com/nJAG7tdIGG
— NDTV (@ndtv) July 3, 2025