దేశంలోని 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి, నైపుణ్యం, ఆర్థిక అవకాశాలను సులభతరం చేయడం లక్ష్యంగా ప్రధానమంత్రి ఐదు-పథకాల ప్యాకేజీలో భాగంగా 2024–25 కేంద్ర బడ్జెట్‌లో ఈఎల్ఐ పథకాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమాలకు కలిపి బడ్జెట్ వ్యయం రూ.2 లక్షల కోట్లుగా ఉంది. ఈ పథకం ఆగస్టు 01, 2025 నుంచి జూలై 31, 2027 వరకు అమలులో ఉంటుంది. ఈ పథకంలో భాగాంగా 3.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈఎల్ఐ పథకంలో రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మీరు మొదటిసారి ఉద్యోగం పొంది ఈపీఎఫ్ఓలో నమోదు చేసుకుంటే మీకు రెండు భాగాలుగా రూ. 15,000 వరకు ప్రోత్సాహకంగా ఇస్తారు. రిజిస్టర్డ్ ఈపీఎఫ్ఓ యజమానితో 6 నెలలు పనిచేసిన తర్వాత మీకు రూ. 7,500, 12 నెలల తర్వాత మిగిలిన మొత్తం రూ. 7,500 లభిస్తుంది. మీరు ఈ మొత్తాన్ని స్వీకరించే ముందు ప్రాథమిక ఆర్థిక కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఈఎల్ఐ స్కీమ్ రెండో భాగానికి వచ్చే సరికి కొత్త ఉద్యోగులను నియమించుకుని కనీసం 6 నెలలు వారిని కొనసాగించినందుకు కంపెనీలకు నెలవారీ బహుమతులు లభిస్తాయి. రూ. 10,000 వరకు జీతం → కంపెనీకి నెలకు రూ. 1,000 లభిస్తుంది. జీతం రూ. 10,001–20,000 → కంపెనీకి నెలకు రూ. 2,000 లభిస్తుంది. జీతం రూ. 20,001–1,00,000 → కంపెనీకి నెలకు రూ. 3,000 లభిస్తుంది. తయారీ రంగానికి, ప్రయోజనం 2 సంవత్సరాలు కాకుండా 4 సంవత్సరాలు కొనసాగుతుంది. అయితే మొదటిసారి ఉద్యోగం పొందిన ఈపీఎఫ్ో రిజిస్టర్డ్ సంస్థలో ఉద్యోగం పొందాలి. అలాగే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) కోసం ఆధార్‌తో లింక్ చేసిన యూఏఎన్ నంబర్‌ను యాక్టివేట్ చేయాలి.
దరఖాస్తు ఇలా
- ఈపీఎఫ్ఓ రికార్డులను సరిగ్గా నిర్వహించాలి.
- క్రమం తప్పకుండా కంపెనీలు ఈపీఎఫ్ రిటర్న్‌లను దాఖలు చేస్తున్నాయో? లేదో? తనిఖీ చేయాలి.
- మీరు ఉద్యోగం చేరి ఆరు నెలలు పూర్తి అయ్యాక ప్రభుత్వం మీ పాన్-లింక్డ్ వ్యాపార ఖాతాకు ప్రోత్సాహకాన్ని బదిలీ చేస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇవి కూడా చదవండి