నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ కీర్తిసురేష్. తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న కీర్తిసురేష్ ఆతర్వాత మహానటి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. మహానటి సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డు అందుకుంది. ఇక ఇప్పుడు తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తెలుగులో చివరగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ సినిమాలో చిరు చెల్లెలిగా కనిపించింది. అలాగే నాని నటిస్తున్న దసరా సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇటీవలే బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టింది. కానీ అక్కడ మొదటి సినిమాతోనే ఫ్లాప్ అందుకుంది.. ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది.
స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే.. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించి మెప్పిస్తుంది. ప్రస్తుతం కీర్తిసురేష్ ఉప్పు కప్పురంబు అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో సుహాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలకానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా విడుదలకానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో కీర్తిసురేష్ చురుగ్గా పాల్గొంటుంది. ఈ క్రమంలోనే తాజాగా సుమతో జరిగిన ఇంటర్వ్యూలో కీర్తిసురేష్ ఆసక్తికర కామెంట్స్ చేసింది.
ఒకవేళ మళ్లీ లాక్ డౌన్ పడితే ఏ హీరోతో ఉండటానికి ఇష్టపడతారు అంటూ సుమ అడిగిన ప్రశ్నకు.. కీర్తిసురేష్ ఆలోచించకుండా నాని పేరు చెప్పింది. నాని, ఆయన సతీమణి అంజు అలాగే నాని కొడుకు అర్జున్ తో కలిసి ఉండటానికి ఇష్టపడతాని అని తెలిపింది. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కీర్తిసురేష్ నాని కలిసి నేను లోకల్, దసరా సినిమాల్లో నటించారు. ఈ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్..
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి