Health Tips: సాధారణంగా చాలా మంది సాక్స్ లేకుండా షూస్ వేసుకునే అలవాటు ఉంటుంది. ఇటీవలి కాలంలో కూడా యువతలో ఇలాంటి ఫ్యాషన్ ఎక్కువగా ఉంది. సాక్స్ లేకుండా షూస్ వేసుకోవడం వల్ల పాదాల్లో దుర్వాసన రావడమే కాకుండా ఆరోగ్యం కూడా పాడవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో చెమట ఎక్కువగా ఉండే భాగాలలో పాదాలు ఒకటి. అలాగే రోజంతా షూస్ వేసుకోవడం వల్ల చెమట ఎక్కువగా పడుతుంది. అందుకే దీనిని వదిలించుకోవడానికి, వాసనను నివారించడానికి, పాదాలను పొడిగా ఉంచడానికి సాక్స్ ఉత్తమం.