అయితే, ఈ ఏడాది గతంలో కంటే ఎక్కువ భక్తులు తరలిరావటంతో స్వామి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో పెరిగింది. ఇప్పటికే వెల కట్టలేని ఆస్తులున్న వెంకన్నకు ఈ వేసవిలో భక్తులు భారీగా కానుకలు సమర్పించారు. ఈ వేసవిలో రోజుకు సగటున 80 వేల మంది స్వామిని దర్శించుకున్నారు. ఒక్క జూన్ నెలలోనే 24.08 లక్షల మంది భక్తులు రాగా, రూ 119.86 కోట్ల మేర కానుకలు వచ్చాయని టీటీడీ తెలిపింది. జూన్ 14న గరిష్టంగా 91,720 మంది స్వామిని దర్శించుకోగా, 30వ తేదీన గరిష్టంగా రూ 5.30 కోట్లు కానుకలుగా అందాయని అధికారులు వెల్లడించారు. ఈ నెలలో మొత్తం 5 రోజులలో రోజులకు 90 వేల మంది, మరో 10 రోజులలో రోజుకు 80వేల మంది భక్తులు వెంకన్నను దర్శించుకోవడం మరో రికార్డుగా నిలిచింది. ఈ వేసవిలో రోజుకు సగటున.. రూ. 4 కోట్ల హుండీ ఆదాయం రాగా, ఏకంగా 10.05 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ వెల్లడించింది. ఈ ఏడాది మే నెలలో 23.77 లక్షల మంది శ్రీవారిని దర్శించుకోగా హుండీ ద్వారా టీటీడీకి రూ 106.83 కోట్ల ఆదాయం చేకూరింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లైన పక్షం రోజులకే.. అత్తతో అల్లుడు జంప్.. అదే కదా మ్యాజిక్
టూ వీలర్ కొంటున్నారా.. ఈ కొత్త రూల్స్ తప్పక తెలుసుకోవాల్సిందే
జాలర్ల వలలో చిక్కిన అసలు సిసలైన చేప.. అబ్బా అదృష్టం ఆంటే ఇతనిదే
Samantha: తనతో మాట్లాడుతుంటే సమయమే తెలియదు.. అసలు నిజం బయటపెట్టిన సమంత
డ్రైనేజీ నుండి వింత శబ్దాలు.. దగ్గరకి వెళ్లి చూసిన స్థానికులు పరుగో పరుగు