ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద రెండో విడత నిధులను జూన్ 10న విడుదల చేయనుంది. మొదటి విడతలో డబ్బులు రానివారు, కొత్తగా చేరిన విద్యార్థుల తల్లులకు ఈ విడతలో రూ.13 వేలు జమ చేస్తారు. లబ్ధిదారుల జాబితాను పాఠశాలల్లో ఉంచుతారు, వెబ్‌సైట్‌లోనూ చూసుకోవచ్చు. అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా తల్లిదండ్రుల సమావేశం కూడా నిర్వహించనున్నారు. ఇంటర్ విద్యార్థులు ఆధార్‌తో బ్యాంకు ఖాతా లింక్ చేసుకోవాలని కూడా అధికారులు సూచించారు.
హైలైట్:
- ఏపీలో తల్లికి వందనం రెండో విడత
- ఈ నెల 10న డబ్బులు విడుదల
- అదే రోజు మెగా పీటీఎం నిర్వహణ

ఈ నెల 10న రెండు విశేషాలు ఉన్నాయి.. ఒకటి తల్లికి వందనం పథకం రెండో విడత డబ్బుల్ని ప్రభుత్వం బ్యాంక్ అకౌంట్‌లలో జమ చేయనుంది. రెండోది రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ (పీటీఎం) నిర్వహించనున్నారు. ఒకే రోజు పీటీఎంతో పాటుగా తల్లికి వందనం డబ్బులు కూడా తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
Thalliki vandanam status check: తల్లికి వందనం రాలేదా, అకౌంట్లో డబ్బులు పడలేదా, ఏం చేయాలంటే?
ఇదిలా ఉంటే.. ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్ ఫస్టియ్ చదువుతున్న ఎస్సీ విద్యార్థుల్ని అధికారులు అలర్ట్చేశారు. ఈనెల 10న తల్లికి వందనం రూ.13వేలు తల్లుల బ్యాంకు అకౌంట్‌లలో జమ చేస్తారని.. కాబట్టి బ్యాంకు అకౌంట్‌ను, ఆధార్ నంబరుకు ఎన్ పీసీఐ లింక్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ లేకపోతే తప్పనిసరిగా బ్యాంకు ఖాతా , లేని పక్షంలో పోస్టాఫీసు ఖాతాను తెరిచి ఆధార్ నంబరుకు ఎన్‌పీసీఐ లింక్ చేయించుకోవాలి అని సూచించారు.