చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు వైసీపీ సమన్వయకర్త కృపాలక్ష్మిపై కేసు నమోదయిది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర పోస్టులపై జనసేన ఫిర్యాదులు చేసింది. మాజీ సీఎం జగన్, పవన్ కళ్యాణ్ ఫోటోలతో అసభ్యకర కామెంట్ కోడ్ చేస్తూ చేసిన పోస్ట్ కలకలం రేపింది. నెల్లూరు వైసీపీ ఇన్‌ఛార్జ్ కృపాలక్ష్మిపై చర్యలు తీసుకోవాలంటూ సోషల్ మీడియా పోస్టులపై జనసేన కేడర్ ఫిర్యాదు చేసింది. గంగాధర నెల్లూరు నియోజకవర్గం పరిధిలోని 6 మండలాల్లోని పీఎస్‌ల్లో జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కృపాలక్ష్మిపై గంగాధర నెల్లూరు పీఎస్‌లో కేసు నమోదయింది.
బిఎన్ఎస్ 353(2), 196తో పాటు 66-డి ఐటీ సెక్షన్లు కింద కేసు నమోదు అయింది. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌పై స్పందించిన కృపాలక్ష్మి తనకు సంబంధం లేదని వివరణ ఇస్తోంది. తన పేరుపై ఫేక్ ఐడి క్రియేట్ చేశారని ఆరోపిస్తోంది. ఇందులో కుట్ర దాగి ఉందని, అక్రమ కేసులకు భయపడేది లేదని అంటోంది. ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నవారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కృపాలక్ష్మి డిమాండ్ చేస్తోంది. అయితే ఇప్పటికే గంగాధర నెల్లూరు పీఎస్‌లో కృపాలక్ష్మిపై కేసు నమోదు చేసినట్లే.. మిగతా అన్ని పోలీస్ స్టేషన్లోనూ కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. దీంతో కృపాలక్ష్మిపై కేసుల నమోదు వ్యవహారం స్థానికంగా పెద్ద చర్చకు దారి తీసింది.