Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Karun Nair : కరుణ్ నాయర్ ఇలాగైతే కష్టమే.. 8ఏళ్ల తర్వాత ఛాన్స్ వచ్చినా నిరూపించుకోలేకపోతే ఎలా ?

12 July 2025

AUS vs WI: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. కెప్టెన్‌గా కమ్మిన్స్ ఔట్.. కొత్త సారథి ఎవరంటే?

12 July 2025

Oh Bhama Ayyo Rama Review: ఓ భామ అయ్యో రామ సినిమా రివ్యూ.. ఈసారి సుహాస్ హిట్టు కొట్టాడా..?

12 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»ముఖ్యమంత్రి చంద్రబాబు,శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న సీఎం చంద్రబాబు – ap cm chandra babu naidu visits srisailam temple
ఆంధ్రప్రదేశ్

ముఖ్యమంత్రి చంద్రబాబు,శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న సీఎం చంద్రబాబు – ap cm chandra babu naidu visits srisailam temple

.By .8 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
ముఖ్యమంత్రి చంద్రబాబు,శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న సీఎం చంద్రబాబు – ap cm chandra babu naidu visits srisailam temple
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణమ్మకు జలహారతి నిర్వహించేందుకు శ్రీశైలం చేరుకున్నారు. ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో చేరుకున్న ఆయన, భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు చేరుకోనున్నారు. ఎగువ రాష్ట్రాల నుంచి వరద నీరు వస్తుండటంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా ఉంది. జలాశయం నుంచి నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. జలహారతి కార్యక్రమం అనంతరం అధికారులు ప్రాజెక్టు నుంచి దిగువకు నీళ్లు విడుదల చేయనున్నారు.

హైలైట్:

  • హెలికాప్టర్‌లో శ్రీశైలానికి చేరుకున్న ముఖ్యమంత్రి
  • పూర్ణకుంభంతో ఆలయంలోకి స్వాగతం పలికిన అర్చకులు
  • దర్శనం అనంతరం జలహారతి కార్యక్రమంలో సీఎం
పూర్ణకుంభంతో ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన అర్చకులు
పూర్ణకుంభంతో ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన అర్చకులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలం చేరుకున్నారు. కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమంలో భాగంగా శ్రీశైలం చేరుకున్న సీఎం ముందుగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సంప్రదాయ వస్త్రాల్లో వచ్చిన ముఖ్యమంత్రికి పూలదండ వేసి ప్రధాన ద్వారం నుంచి ఆలయంలోకి ఆహ్వానించారు.కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమం లో భాగంగా ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి శ్రీశైలం బయల్దేరారు. శ్రీశైలం చేరుకున్న చంద్రబాబుకు స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి, అధికారులు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. హెలికాప్టర్ నుంచి దిగిన సీఎం నేరుగా శ్రీశైలం మల్లన్న ఆలయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా శ్రీశైలం చేరుకున్నారు. జలహారతి కార్యక్రమం అనంతరం నీటి వినియోగాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో చర్చించనున్నారు.
తొలుత శ్రీశైలం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జలాశయం వద్దకు చేరుకుంటారు. జలహారతి కార్యక్రమంలో భాగంగా కృష్ణమ్మకు హారతి ఇస్తారు. తొలి ఏకాదశి నుంచి రైతులు దుక్కులు దున్ని పంటలు వేసుకునే సమయం కావడంతో ప్రతి ఏడాది ఈ జలహారతి కార్యక్రమం నిర్వహిస్తారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణా నది ఇప్పటికే కళకళలాడుతోంది. శ్రీశైలంలోని కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణ, గోదావరి నదులు జలకళను సంతరించుకున్నాయి. సుంకేశుల, జూరాల నుంచి వరద నీరు శ్రీశైలానికి జలాశయానికి పోటెత్తుతోంది. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 881.6 అడుగులకు నీరు చేరింది. పై నుంచి 1,72,705 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండటంతో 67,563 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జలహారతి కార్యక్రమం అనంతరం అధికారులు దిగువకు నీరు విడుదల చేయనున్నారు.

మహేష్ గోనె

రచయిత గురించిమహేష్ గోనెగోనె ఉమామహేశ్వర రావు (మహేష్ గోనె) తెలుగులో కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో పదేళ్ల అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాశారు.… ఇంకా చదవండి