Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Prabhas: ఏంటీ.. బాహుబలి సినిమాలకు ప్రభాస్ రెమ్యునరేషన్ అంతేనా.. ? ఎన్ని కోట్లంటే..

12 July 2025

Video : ఏమి జోకేశాడేమో..పంత్ తెగ నవ్వేస్తున్నాడు.. ఏదేమైనా గంభీర్లో సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగానే ఉంది

12 July 2025

Coral Jewellery: పగడపు నగలు ధరిస్తే లాభాలు ఏంటి.? జ్యోతిష్యం ఏం చెబుతుందంటే.?

12 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Cm Chandrababu Naidu,కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన చంద్రబాబు.. శ్రీశైలం ప్రాజెక్టులో నాలుగు గేట్ల ఎత్తివేత! – andhra pradesh chief minister chandrababu naidu jala harathi to river krishna at srisailam
ఆంధ్రప్రదేశ్

Cm Chandrababu Naidu,కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన చంద్రబాబు.. శ్రీశైలం ప్రాజెక్టులో నాలుగు గేట్ల ఎత్తివేత! – andhra pradesh chief minister chandrababu naidu jala harathi to river krishna at srisailam

.By .8 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Cm Chandrababu Naidu,కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన చంద్రబాబు.. శ్రీశైలం ప్రాజెక్టులో నాలుగు గేట్ల ఎత్తివేత! – andhra pradesh chief minister chandrababu naidu jala harathi to river krishna at srisailam
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


శ్రీశైలం జలాశయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. ఎగువ రాష్ట్రాల్లో వర్షాల కారణంగా శ్రీశైలం నిండుకుండలా మారడంతో దిగువకు నీటిని విడుదల చేశారు. రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు శ్రీశైల మల్లన్నకు పూజలు చేశానని ఆయన తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులకు తమ ప్రభుత్వం రూ. 68 వేల కోట్లు ఖర్చు చేసిందని, పోలవరం ప్రాజెక్టు ద్వారానే రాయలసీమకు నీళ్లు వస్తున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. సముద్రంలో కలిసే కృష్ణా జలాలను తెలుగు రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.

హైలైట్:

  • శ్రీశైలంలో పూజలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
  • అనంతరం కృష్ణా నదికి జలహారతి చేపట్టిన సీఎం
  • నాలుగు గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల
జలహారతి ఇస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
జలహారతి ఇస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలం జలాశయం వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు పడుతుండటంతో శ్రీశైలం డ్యామ్ నిండుకుండలా మారింది. దాంతో దిగువకు నీళ్లు వదలాల్సి రావడం, తొలకరి కూడా పలకరించడంతో ముఖ్యమంత్రి మంగళవారం జలహారతి ఇచ్చి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టులోని 6, 7, 8, 11వ నెంబర్ గేట్లు ఎత్తివేసి అనంతరం నీటి వినియోగదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాయలసీమ రతనాల సీమ కావాలంటూ శ్రీశైల మల్లన్నకు పూజలు చేశానని చెప్పారు. ఎగువ నుంచి వచ్చిన 200 టీఎంల నీటితో శ్రీశైలం జలాశయం నిండుకుండలా ఉందన్నారు. ప్రస్తుతం జలాలే మన సంపద అని.. సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు అని కొనియాడారు. రాయలసీమను కాపాడలేరని గతంలో చాలామంది ఎద్దేవా చేశారని, సీమ స్థితిగతులు మార్చేందుకు ఎన్టీఆర్ నడుం బిగించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు.

జీడిపల్లికి నీరు తీసుకెళ్లే బాధ్యత తమ ప్రభుత్వానిదే అని చంద్రబాబు నాయుడు మాట ఇచ్చారు. ఈ నెల 15వ తేదీ కల్లా ఆ ప్రాంతానికి నీరు రావాలని అధికారులకు టార్గెట్ విధించానని, 30వ తేదీకి కుప్పం, మదనపల్లెకు నీళ్లు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టులకు రూ. 68 వేల కోట్లు ఖర్చు చేశామని.. పోతిరెడ్డిపాడు, గాలేరు – నగిరి, గండికోట అన్నీ తమ హయాంలోనే వచ్చాయని చంద్రబాబు చెప్పారు.

సముద్రంలో కలిసే నీటిని తెలుగు రాష్ట్రాలు వాడుకుంటే మంచిదని, దాంతో రెండు తెలుగు రాష్ట్రాల రైతులకు మంచి జరుగుతుందని ముఖ్యమంత్రి ఆలోచన చేశారు. తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్ కావాలనేదే తన లక్ష్యమన్నారు. రాయలసీమకు ఇప్పుడు నీళ్లు వస్తున్నాయంటే అది పోలవరం వల్లేనన్నారు. గతంలో రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు తిని ఎలాంటి అనారోగ్యం లేకుండా ఉన్నామని.. ఇప్పుడు పాలిష్డ్ రైస్ తిని షుగర్ వ్యాధులు తెచ్చుకుంటున్నారని చెప్పారు. రాయలసీమలో అన్ని రకాల కూరగాయలు, పండ్లు పండుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు భూమా అఖిలప్రియ, రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

మహేష్ గోనె

రచయిత గురించిమహేష్ గోనెగోనె ఉమామహేశ్వర రావు (మహేష్ గోనె) తెలుగులో కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో పదేళ్ల అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాశారు.… ఇంకా చదవండి