కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండటంతో.. శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది.. ఈ క్రమంలో.. కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. డ్యామ్ గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. మంగళవారం శ్రీశైలంలో పర్యటించిన సీఎం చంద్రబాబు.. నిండుకుండలా మారిన శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. 6,7,8, 11 మొత్తం నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. మహారాష్ట్రతో పాటు ఎగువ పరీవాహక ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షాలు పడుతుండటంతో కృష్ణానది ఉరకలేస్తోంది. ఆలమట్టి, నారాయణ్ పూర్ ప్రాజెక్టులు కూడా గరిష్ఠనీటి మట్టానికి చేరుకున్నాయి. దీంతో ఇవాళ ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. శ్రీశైలానికి ఎగువ నుంచి లక్షా 62వేల 529 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని అధికారులు చెబుతున్నారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు.. హెలికాప్టర్ నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్ ను, నదీ ప్రవాహాలను, పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు.. ఎరియల్ వ్యూ ద్వారా అన్ని ప్రాంతాలను పరిశీలించారు.
వీడియో చూడండి..
నాగార్జున సాగర్‌కు పెరుగుతున్న వరద ప్రవాహం..
ఇటు నాగార్జున సాగర్‌కు కూడా వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. ఈసారి నెలరోజుల ముందుగానే సాగర్‌కు వరద పోటెత్తింది. ఇక శ్రీశైలం గేట్లు కూడా ఎత్తేయడంతో నెలరోజుల్లో పూర్తిస్థాయి నీటిమట్టానికి సాగర్ చేరుకుంటుందని అధికారులు తెలిపారు. గత ఏడాది ఆగస్టులో ఎత్తిన సాగర్ గేట్లు… ఈసారి జూలై చివరిలోనే ఎత్తే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు శ్రీశైలం గేట్లు ఎత్తడం వల్ల ప్లంజ్‌పూజ్‌కు ఇప్పటికిప్పుడే ఎలాంటి ప్రమాదం లేదంటున్నారు నిపుణులు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..