తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ఏ.రాజశేఖర్ బాబు అనే అధికారి అన్యమత ప్రార్థనల్లో పాల్గొన్నందుకు సస్పెండ్ అయ్యారు. పుత్తూరులోని చర్చిలో ఆయన ప్రార్థనలు చేస్తున్న ఫోటోలు, వీడియోలు బయటకు రావడంతో టీటీడీ విజిలెన్స్ విభాగం విచారణ జరిపింది. ఆయన ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని టీటీడీ పేర్కొంది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా రాజశేఖర్ బాబుపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఓ అధికారిక నోట్‌ను కూడా రిలీజ్ చేశారు.
హైలైట్:
- చర్చి ప్రార్థనల్లో టీటీడీ ఏఈఓ
- ఫొటోలు తీసి టీటీడీకి ఇచ్చిన ఓ భక్తుడు
- విచారణ చేపట్టి సస్పెండ్ చేసిన టీటీడీ

టీటీడీ ఉద్యోగిగా ఉంటూనే సంస్థ ప్రవర్తన నియమావళిని పాటించకపోవడమే కాకుండా, హిందూ ధార్మిక సంస్థకు ప్రాతినిథ్యం వహించే ఉద్యోగిగా ఉంటూ బాధ్యతారహితంగా వ్యవహరించాడంటూ టీటీడీ ఓ ప్రెస్‌నోట్ విడుదల చేసింది. టీటీడీ విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదికను, ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం ఆయనపై శాఖపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది.