Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Shubman Gill : గర్ల్ ప్రెండ్ పేరు అడగ్గానే శుభమన్ గిల్ ఏమన్నాడో తెలుసా.. అభిషేక్ శర్మ వీడియో వైరల్

13 July 2025

Amaravati Landless Poor Pension,ఏపీలో వారికి కొత్తగా పింఛన్లు.. ప్రభుత్వం ఉత్తర్వులు.. నెలకు రూ.5000! – ap government decides to provide pensions to 1575 more landless families in amaravati

13 July 2025

Bank Holidays: వచ్చే రెండు వారాల్లో 6 రోజులు బ్యాంకులు బంద్‌

13 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Annadata Sukhibhava Scheme 2025 Status Check,అన్నదాత సుఖీభవ పథకం అర్హుల లిస్ట్.. స్టేటస్‌ ఇలా చెక్ చేస్కోండి, మీ పేరు లేకపోతే ఇలా చేయండి.. జులై 13 వరకు ఛాన్స్ – annadata sukhibhava scheme 2025 eligibility list in rythu seva kendrams and farmers who are not list can complaint till july 13th
ఆంధ్రప్రదేశ్

Annadata Sukhibhava Scheme 2025 Status Check,అన్నదాత సుఖీభవ పథకం అర్హుల లిస్ట్.. స్టేటస్‌ ఇలా చెక్ చేస్కోండి, మీ పేరు లేకపోతే ఇలా చేయండి.. జులై 13 వరకు ఛాన్స్ – annadata sukhibhava scheme 2025 eligibility list in rythu seva kendrams and farmers who are not list can complaint till july 13th

.By .9 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Annadata Sukhibhava Scheme 2025 Status Check,అన్నదాత సుఖీభవ పథకం అర్హుల లిస్ట్.. స్టేటస్‌ ఇలా చెక్ చేస్కోండి, మీ పేరు లేకపోతే ఇలా చేయండి.. జులై 13 వరకు ఛాన్స్ – annadata sukhibhava scheme 2025 eligibility list in rythu seva kendrams and farmers who are not list can complaint till july 13th
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Annadata Sukhibhava Scheme 2025 Complaints: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద పీఎం కిసాన్‌కు అర్హుల జాబితాను సిద్ధం చేసింది. జాబితాలో పేరు లేని రైతులు ఈ నెల 13లోగా రైతు సేవా కేంద్రాల్లో అర్జీలు అందజేయవచ్చు లేదా పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చు. అర్హులైన రైతుల ఖాతాల్లో ఈ నెలలోనే రూ.7 వేలు జమ చేయనున్నారు. రైతులు మన మిత్ర వాట్సాప్ ద్వారా కూడా అర్హత తెలుసుకోవచ్చు.

హైలైట్:

  • అన్నదాత సుఖీభవ పథకం అమలు
  • రైతు సేవా కేంద్రాల్లో అర్హుల జాబితా
  • ఈ నెల 13 వరకు ఫిర్యాదు చేయొచ్చు
అన్నదాత సుఖీభవ పథకం 2025
అన్నదాత సుఖీభవ పథకం 2025 (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్‌లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం పీఎం కిసాన్‌కు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఈ పథకానికి అర్హుల జాబితాను ఏపీ ప్రభుత్వం సిద్ధం చేసింది.. ఈ మేరకు అర్హుల జాబితాను రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. ఒకవేళ అర్హుల జాబితాలో పేరు లేనివారు రైతు సేవా కేంద్రంలో అర్జీలు అందజేయొచ్చన్నారు వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢిల్లీరావు. అంతేకాదు అన్నదాత సుఖీభవ పోర్టల్‌లోని గ్రీవెన్స్ మాడ్యూల్‌లోనూ ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. ఈ ఫిర్యాదులు అందజేందుకు ఈ నెల 13వరకే అవకాశం ఉంటుందన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ఈ నెలలోనే రూ.7వేలు రైతుల బ్యాంక్ అకౌంట్‌లలో జమ కానున్నాయి.

రైతులు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన పోర్టల్‌, మన మిత్ర వాట్సాప్‌లో ఆధార్‌ నంబర్‌ ద్వారా అర్హత ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఈ మేరకు మన మిత్ర వాట్సప్‌ నంబర్‌ 95523 00009కు ఆధార్‌ నంబర్‌ను పంపితే వివరాలు వస్తాయి. ఒకవేళ అర్హుల జాబితాలో రైతు పేరు లేకపోతే.. అర్హత ఉందని భావిస్తే రైతు సేవా కేంద్రంలో అర్జీతో పాటు అవసరమైన పత్రాలు సమర్పించాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే రైతులు అన్నదాత సుఖీభవ పోర్టల్‌లోని గ్రీవెన్స్‌ మాడ్యూల్‌లో కూడా ఫిర్యాదు చేయొచ్చు. ఈనెల 13 ఫిర్యాదు చేయొచ్చని.. ఈ సమాచారం రైతులకు వివరించాలని ఉద్యోగులు ముమ్మర ప్రచారం చేయాలి అన్నారు వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢిల్లీరావు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని కూడా సూచించారు. రైతులు అర్హుల జాబితాలో పేరు లేకపోతే వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.

ఆ డబ్బులు ఖర్చు చేయలేను.. సంక్షేమ పథకాల అమలుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాలను కలిపి అమలు చేస్తోంది. రైతులకు పెట్టుబడి సాయం అందిస్తోంది.. ఈ పథకం కింద రైతులకు ఏడాదికి రూ. 20 వేలు ఇస్తారు. కేంద్రం రూ. 6 వేలకు.. ఏపీ ప్రభుత్వం రూ. 14 వేలు కలిపి రూ.20వేలు అందజేస్తారు.ఈ డబ్బును మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఈ నెలలోనే మొదటి విడత డబ్బు విడుదల కానుంది. చిన్న రైతులు, కౌలు రైతులు ఈ పథకం ద్వారా లాభం పొందుతారు. పీఎం కిసాన్ డబ్బు విడుదల చేసే సమయంలోనే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెలలోనే ఏపీ రైతులకు డబ్బులు విడుదల చేయాలని నిర్ణయించారు.. ఈనెలలో తొలి విడత కింద రూ.7వేలు చొప్పున అకౌంట్‌లలో జమ చేయనున్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి