విశాఖపట్నం, జులై 9: గిరి ప్రదక్షిణ చేస్తే భూమి ప్రారక్షణ చేసిన అంత పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అంతటి మహోన్నతమైన సింహాచలం గిరి ప్రదక్షిణ మహోత్సవానికి సమయం ఆసన్నమైంది. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా చతుర్దశి నాడు లక్షలాది మంది భక్తులు సింహగిరి ప్రదక్షిణ చేయడం ఆనవాయితీ. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసింది అధికార యంత్రంగం. గతంలో అనుభవాల నేపథ్యంలో ఎటువంటి అవాంతరాలు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ప్రత్యేక ఆషాడ పౌర్ణమి సందర్భంగా చతుర్దశి నాడు గిరిప్రదక్షిణ చేయడం ఆనవాయితీ. 32 కిలోమీటర్ల దూరం సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకుంటే కలిగే భాగ్యమే వేరని భక్తులు నమ్ముతూ ఉంటారు. సింహాచలేశ్వరుడు కొలువుదిరిన సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే భూమి ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం. అందుకే ప్రతీయేటా లక్షలాదిమంది భక్తులు కాలినడకన 32 కిలోమీటర్లు ప్రదక్షిణ చేస్తారు.
ఈ రోజు (జులై 9) సింహాచలం కొండ దిగువన తొలిపావంచా వద్ద నుంచి గిరిప్రదక్షిణం ప్రారంభమైంది. స్వామి వారి నమూనా విగ్రహంతో పుష్పరథం కదిలింది. రథాన్ని ఆలయ అనువంశిక ధర్మ పూసపాటి అశోక్ గజపతిరాజు జెండా ఊపి ప్రారంభించారు. రథం వెంట లక్షలాది మంది భక్త జనం గిరి ప్రదక్షిణకు శ్రీకారం చుట్టారు. తొలిపావంచా నుంచి మొదలైన ప్రదక్షిణ పాత అడివివరం మీదుగా పైనాపిల్ కాలనీ, ముడసర్లోవ, హనుమంతవాక, విశాలాక్షినగర్, జోడుగుళ్లపాలెం, అప్పుఘర్, ఎంవీపీ కాలనీ, వెంకోజీపాలెం, ఇసుకతోట, హెచ్ బి కాలనీ, సీతమ్మధార, అల్లూరి విగ్రహం, బాలయ్యశాస్త్రి లే అవుట్, పోర్టు స్టేడియం, కంచరపాలెం, మాధవధార, మురళీనగర్, ఎన్ఏడీ కూడలి, గోపాలపట్నం బంకు, ప్రహ్లాదపురం, పాత గోశాల మీదుగా తిరిగి సింహాచలం చేరుకుని ప్రదక్షిణ ముగుస్తుంది.
భక్తుల గిరి దక్షిణం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది అధికార యంత్రము. తొలి పావంచ వద్ద కొబ్బరికాయలు కొట్టేందుకు ఇనప దిమ్మలు సిద్ధం చేశారు. దారి పొడవునా వాలంటీర్లు స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రసాద వితరణ తాగునీరుతో పాటు.. టాయిలెట్ల సదుపాయం కల్పించారు. అలాగే వైద్య శిబిరాలు పోలీస్ పహారా కూడా ఏర్పాటు చేస్తున్నారు. గిరిప్రదక్షిణ సమయంలో పుణ్యా స్థానాలు చేయడం అనవయతి. ఆయా ప్రాంతాల్లో గజ ఈతగాళ్లతో పాటు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఇప్పటికే అధికార యంత్రంగం తో హోం మంత్రి అనిత సమీక్ష చేశారు.
ఇవి కూడా చదవండి
గిరి ప్రదక్షణ ఆలయ ప్రదక్షిణ పూర్తి చేసి స్వామివారిని దర్శించుకున్న తర్వాత భక్తులను కొండ దిగువకు చేర్చేందుకు ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తున్నారు. 50 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. గిరి ప్రదక్షిణ మార్గంలోని 29 ప్రాంతాల్లోని ప్రత్యేక స్టాళ్లలో విశ్రాంతి తీసుకోవడానికి కుర్చీలు, కార్పెట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు ప్రత్యేకంగా సింహాచలం వెల్లి అక్కడే పరిస్థితులపై సమీక్ష చేసి అధికారులకు సూచనలు చేశారు. ఇదిలా ఉంటే ఈ నెల 10న ఆలయ ప్రదక్షణ, చంద్రన్న సమర్పణ ఉంటుంది. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా 10న సింహాద్రినాథుడికి చివరి విడత చందన సమర్పణ చేస్తారు. ఆరోజు వేకువజామున 2 గంటలకే సుప్రభాత సేవ, ప్రాతఃకాల పూజలు నిర్వహిస్తారు. అనంతరం సుగంధ ద్రవ్యాలు మిళితం చేసి సిద్ధం చేసిన మూడు మణుగుల చందనం అంటే.. సుమారు 125కిలోలు శ్రీగంధాన్ని స్వామికి సమర్పణ చేస్తారు.
32 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణకు భక్తులకు నేటి నుంచి అవకాశం కల్పిస్తారు. వేకువజామున 3 గంటల నుంచి ఆలయ వెలుపల నుంచి భక్తులు ఆలయ ప్రదక్షిణకు అనుమతిస్తారు. ఉత్తర గోపురం, దక్షిణ గోపురం వద్ద ర్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. లక్షలాదిగా వచ్చే భక్తులు కూడా అక్కడ పరిస్థితులు ఏర్పాట్లకు తగ్గట్టుగా సహకరించాలని కోరుతున్నారు అధికారులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.