Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Viral Video: ఆ ఇంట్లో కాపురం పెట్టిన తాచుపాము.. గుట్టలు గుట్టలుగా పాము పిల్లలు, గుడ్లు.. వీడియో చూస్తే గుండె గుభేల్

13 July 2025

IND vs ENG: 0,0,0,0,0,0.. 7 ఇన్నింగ్స్‌లలో 6 సార్లు.. బూం, బూం ఖాతాలో సిగ్గుపడే రికార్డ్..

13 July 2025

Viral Video: భార్యతో సెల్ఫీ దిగుతూ నదిలో పడ్డ భర్త… ఒడ్డుకు చేరిన భర్త చెప్పింది విని షాక్‌

13 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Achampet Mla Meet Chandrababu,చంద్రబాబును కలిసిన తెలంగాణ ఎమ్మెల్యే.. స్పెషల్ రిక్వెస్ట్, ఏపీ సీఎం సానుకూలం – achampet mla chikkudu vamshi krishna meet ap cm chandrababu naidu in srisailam
ఆంధ్రప్రదేశ్

Achampet Mla Meet Chandrababu,చంద్రబాబును కలిసిన తెలంగాణ ఎమ్మెల్యే.. స్పెషల్ రిక్వెస్ట్, ఏపీ సీఎం సానుకూలం – achampet mla chikkudu vamshi krishna meet ap cm chandrababu naidu in srisailam

.By .9 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Achampet Mla Meet Chandrababu,చంద్రబాబును కలిసిన తెలంగాణ ఎమ్మెల్యే.. స్పెషల్ రిక్వెస్ట్, ఏపీ సీఎం సానుకూలం – achampet mla chikkudu vamshi krishna meet ap cm chandrababu naidu in srisailam
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Achampet Mla Meet Ap CM Chandrababu: తెలంగాణ ఎమ్మెల్యే వంశీకృష్ణ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును శ్రీశైలంలో కలిసి, కృష్ణా నదిపై వంతెన నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఈ వంతెన రాయచూరు, కర్ణాటక ప్రాంతాలకు దూరం తగ్గిస్తుందని ఆయన విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం, చంద్రబాబు శ్రీశైలంలోని భ్రమరాంబ, మల్లికార్జున స్వామి దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. జూలైలోనే ప్రాజెక్టు నిండటం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.

హైలైట్:

  • చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
  • శ్రీశైలంలో కలిసి స్పెషల్ రిక్వెస్ట్ చేశారు
  • చంద్రబాబు సానుకూలంగా స్పందించారట
చంద్రబాబుకు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ వినతి
చంద్రబాబుకు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ వినతి (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును తెలంగాణ ఎమ్మెల్యే కలిశారు.. నంద్యాల జిల్లా శ్రీశైలంలో కలిసి ఓ చిన్న రిక్వెస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదిపై వంతెన నిర్మాణానికి సహకరించాలని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని కోరారు. శ్రీశైలం జలాశయం నుంచి నీటిని విడుదల చేయడానికి వచ్చిన సమయంలో.. ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆయనతో మాట్లాడారు. మద్దిమడుగు దగ్గర బ్రిడ్జి అవసరాన్ని చంద్రబాబు వివరించారు. ఈ మేరకు చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చారు. ఈ బ్రిడ్జితో రాయచూరు, కర్ణాటక ప్రాంతాలకు దూరం తగ్గుతుందని తెలిపారు. ఏపీ నుంచి నల్లమలలోని మద్దిమడుగు పుణ్యక్షేత్రానికి భక్తులు వస్తుంటారు. ఈ బ్రిడ్జి కడితే రాయచూరు, కర్ణాటకకు వంద కిలోమీటర్ల దూరం తగ్గుతుందంటున్నారు ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఈ బ్రిడ్జి విషయంలో చంద్రబాబు సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. వంతెన నిర్మాణం జరిగితే రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు సులభంగా ఉంటుందన్నారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీశైలంలోని భ్రమరాంబ, మల్లికార్జున స్వామి దేవాలయాలను సందర్శించారు. శ్రీశైలం చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకుదేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి వినయ్‌చంద్, ఇంఛార్జ్ కమిషనర్‌ రామచంద్రమోహన్, ఈవో ఎం.శ్రీనివాసరావు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. చంద్రబాబు స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు.. మల్లికార్జునస్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. త్రిఫలవృక్షం వద్ద దేవస్థానం వృషభానికి గ్రాసం తినిపించారు. భ్రమరాంబాదేవికి ప్రత్యేక అర్చనలు చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక పూజలు చేసి.. సంకల్పం నెరవేరాలని రుద్రహోమం, చండీహోమాలు నిర్వహించారు.. రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, ఎమ్మెల్యేలు, పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దేవస్థానం అర్చకులు, వేద పండితులు ముఖ్యమంత్రికి ఆశీర్వచనం ఇచ్చారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, దేవాదాయ శాఖ అధికారులు సీఎంకు జ్ఞాపికను అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి నీళ్లను దిగువకు విడుదల చేశారు.

శ్రీశైలం నుంచి సాగర్ దిశగా కృష్ణమ్మ పరుగులు.. జలహారతి ఇచ్చిన సీఎం

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర కృష్ణమ్మకు పూజలు చేశారు.. జలహారతి ఇచ్చారు. ఆయన సారె సమర్పించి, నాలుగు గేట్లు తెరిచి నీటిని దిగువకు వదిలారు. ఆ తరువాత సున్నిపెంటలో జరిగిన ‘జలహారతి’ సభలో మాట్లాడారు. జూలైలోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండిందఅన్నారు. తన జీవితంలో ఇది సంతోషకరమైన రోజన్నారు చంద్రబాబు నాయుడు. వాస్తవానికి రాష్ట్రంలో ఇంకా వర్షాలు సరిగా పడలేదు.. కానీ ఎగువ రాష్ట్రాల్లో వర్షాల వల్ల శ్రీశైలం జలాశయం నిండిందన్నారు. నీళ్లు మన సంపదని.. నీళ్లు ఉంటే సంపదను సృష్టించవచ్చన్నారు. శ్రీశైలం ఒక పవిత్ర పుణ్యక్షేత్రం.. మల్లికార్జునస్వామి దయతో రాయలసీమ సుభిక్షంగా ఉంటుందన్నారు. “నీటివిలువ తెలిసినవాడిగా జలహారతి ఇచ్చానని.. తన జీవితంలో ఇది సంతోషకరమైన రోజు అన్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి