Sabari Express Converted Into SuperFast: రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరువనంతపురం-సికింద్రాబాద్ శబరి ఎక్స్‌ప్రెస్‌ను సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌గా మార్చింది. తెలుగు రాష్ట్రాల మీదుగా తిరుపతి వెళ్లే ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రైలు నంబర్లను మారుస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరికొన్ని రైళ్లకు అదనపు బోగీలను జత చేయనున్నారు. రైళ్లలో పోగొట్టుకున్న మొబైల్స్‌ను తిరిగి అప్పగించేందుకు ‘ఆపరేషన్ అమానత్’ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు.
హైలైట్:
- రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక
- ఆ ఎక్స్‌ప్రెస్ రైలు సూపర్ ఫాస్ట్‌గా మార్పు
- కొత్త నంబర్లు కేటాయించిన రైల్వేశాఖ

ఈ రైలు ఏపీలోని నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, నిడుబ్రోలు, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు రైల్వే స్టేషన్‌లలో ఆగుతుంది. తెలంగాణలోని సికింద్రాబాద్, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడలో ఆగుతుంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు తెలిపారు.. త్వరలోనే ఈ మార్పులకు సంబంధించిన పూర్తి వివరాలను రైల్వే అధికారులు వెల్లడిస్తారు.
శ్రీశైలం నుంచి సాగర్ దిశగా కృష్ణమ్మ పరుగులు.. జలహారతి ఇచ్చిన సీఎం
మరోవైపు దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల రద్దీని గమనించి.. ఎనిమిది రైళ్లకు అదనంగా ఒక్కో థర్డ్ ఏసీ బోగీని జత చేస్తున్నారు. జులై 13, 14 తేదీల నుంచి ఏసీ బోగీ కూడా అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు. విజయవాడ-చెన్నై, చెన్నై-విజయవాడ (12711, 12712), సికింద్రాబాద్-గుంటూరు, గుంటూరు – సికింద్రాబాద్ (17201, 17202), సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్, సిర్పూర్ కాగజ్‌నగర్- సికింద్రాబాద్ (17233, 17234), విజయవాడ-కాచిగూడ, కాచిగూడ-విజయవాడ (12713, 12714) రైళ్లకు అదనపు బోగీ ఉంటుంది. అంతేకాదు ప్రయాణికులు రైళ్లలో, రైల్వే స్టేషన్‌లలో మొబైల్స్ పోగొట్టుకుంటే వాటిని అప్పగించేందుకు ‘ఆపరేషన్ అమానత్’ కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. గత నెలలో ఏకంగా 140 ఫిర్యాదులు వచ్చాయి.. 25 మొబైల్స్ గుర్తించి.. అందులో 14 ప్రయాణికులకు అందజేశారు.