Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Wimbledon: 57 నిమిషాల్లోనే మ్యాచ్ క్లోజ్.. 114 ఏళ్ల తర్వాత తొలిసారి.. చరిత్ర సృష్టించిన పోలిష్ బ్యూటీ

13 July 2025

IND vs ENG: లార్డ్స్ టెస్ట్‌‌లో టీమిండియాదే విజయం.. 4వ రోజు ఈ 3 కీలక నిర్ణయాలతో రిజల్ట్ పక్కా..

13 July 2025

IND vs ENG 4th Test: ఆ ఇద్దరిపై గంభీర్ గరం, గరం.. 4వ టెస్ట్‌కు భారత జట్టులో 3 కీలక మార్పులు

13 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ttd Technology For Timely Tirumala Darshan,తిరుమల శ్రీవారి దర్శనం ఇకపై చాలా త్వరగా.. టీటీడీ ఆ ఒక్క నిర్ణయంతో సింపుల్‌గా – ttd to use technology for timely tirumala darshan says eo j syamala rao
ఆంధ్రప్రదేశ్

Ttd Technology For Timely Tirumala Darshan,తిరుమల శ్రీవారి దర్శనం ఇకపై చాలా త్వరగా.. టీటీడీ ఆ ఒక్క నిర్ణయంతో సింపుల్‌గా – ttd to use technology for timely tirumala darshan says eo j syamala rao

.By .9 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ttd Technology For Timely Tirumala Darshan,తిరుమల శ్రీవారి దర్శనం ఇకపై చాలా త్వరగా.. టీటీడీ ఆ ఒక్క నిర్ణయంతో సింపుల్‌గా – ttd to use technology for timely tirumala darshan says eo j syamala rao
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Tirumala Darshan TTD Technology: తిరుమల శ్రీవారి దర్శనం మరింత సులభతరం చేసేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. భక్తులకు కేటాయించిన సమయంలోనే దర్శనం కల్పించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని ఈవో జె. శ్యామలరావు అధికారులను ఆదేశించారు. క్యూఆర్ కోడ్, ముఖ గుర్తింపు ద్వారా భక్తులను ధృవీకరించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఈ మేరకు టీటీడీ ఈవో కీలక సమీక్ష చేశారు. మరోవైపు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కవచ సమర్పణతో జ్యేష్టాభిషేకం ఘనంగా ముగిసింది.

హైలైట్:

  • తిరుమల శ్రీవారి దర్శనం సకాలంలో
  • టీటీడీ ఈవో శ్యామలురావు కీలక సమీక్ష
  • భక్తులకు సంతృప్తికరమైన దర్శనం
తిరుమల శ్రీవారి దర్శనం త్వరగా
తిరుమల శ్రీవారి దర్శనం త్వరగా (ఫోటోలు– Samayam Telugu)

కలియుగ దైవం తిరుమల శ్రీవారి దర్శనం సకాలంలో, త్వరగా పూర్తయ్యేలా టీటీడీ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు టీటీడీ ఈవో జే శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరి, టీసీఎస్ ప్రతినిధులు, టీటీడీ ఐటీ అధికారులతో కలిసి కీలక సమీక్ష నిర్వహించారు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనార్థం విచ్చేసే భక్తులకు టెక్నాలజీ సాయంతో నిర్దేశించిన సమయానికి దర్శనం అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు.’తిరుమల శ్రీవారి దర్శనానికి సర్వదర్శనం, సమయ నిర్దేశిత సర్వదర్శనం (ఎస్.ఎస్.డి), ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఎస్.ఈ.డి), దివ్యదర్శనం తదితర మార్గాల ద్వారా తిరుమలకు భక్తులు వస్తుంటారు. సదరు భక్తులకు టెక్నాలజీ సాయంతో సకాలంలో దర్శనం చేయించడంపై తగు చర్యలు తీసుకోవాలి. భక్తులు శ్రీవారి దర్శనానికి క్యూలైన్లలో చేరినప్పటి నుంచి దర్శనం అయ్యే వరకు టెక్నాలజీని ఉపయోగించి శ్రీవారి దర్శనం సులభతరం చేయించే అంశానికి సంబంధించి తగు చర్యలు తీసుకోవాలి. ఈ అంశంపై నిర్ధిష్ట నిర్ణయానికి వచ్చేందుకు టిసిఎస్ ప్రతినిధులు, టీటీడీ ఐటీ విభాగంతో కూడిన ప్రతినిధులు తరచూ సమావేశాలు నిర్వహించి ప్రణాళికబద్ధంగా చర్యలు చేపట్టాలి’ అన్నారు శ్యామలరావు.

‘టీటీడీలో ఇప్పటి వరకు సిబ్బందితో భక్తులను ధృవీకరించడం జరుగుతోందని, సాంకేతిక రంగంలో వేగంగా మారుతున్న మార్పులకు అనుగుణంగా క్యూఆర్ కోడ్, ముఖ గుర్తింపు పద్దతి ద్వారా భక్తులను ధృవీకరించి మరింత సమయాన్ని ఆదా చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఈవో కోరారు. అదే విధంగా శ్రీవారి దర్శనానికి భక్తులకు కేటాయించిన సమయానికి రాకపోవడం మూలంగా మరింత ఆలస్యం అవుతోందని, భక్తులను నిర్దేశించిన సమయానికి వారికి కేచాయించిన ప్రాంతానికి వచ్చేలా భక్తులకు అవగాహన కల్పించాలని సూచించారు. తద్వారా మరింత సమయం ఆదా కావడమే కాక, భక్తులకు సంతృప్తికరమైన శ్రీవారి దర్శనం చేయొచ్చు’ అని సూచించారు.

‘భక్తులు క్యూలైన్లలో ప్రవేశించినప్పటి నుండి కంపార్మెంట్లలో ఎంత సేపు ఉంటున్నారు, క్యూలైన్లలో భక్తులు చేరినప్పటి నుంచి శ్రీవారి దర్శనానికి ఎంత సమయం అవుతోంది, అనంతరం ఆలయం నుండి వెలుపలికి రావడానికి ఎంత సమయం పడుతోంది, సమయ నిర్దేశిత సర్వదర్శనం ( ఎస్.ఎస్.డి), ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఎస్.ఈ.డి), దివ్యదర్శనం, ఆర్జిత సేవలకు భక్తులు దర్శనం కోసం వేచియున్న సమయాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా టిసిఎస్ ప్రతినిధులు వివరించారు’ అని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.

తిరుమల దర్శనం కోసం ఆ భక్తుడు ఏం చేశాడో చూశారా.. చివరికి క్షమాపణలు చెప్పాడుగా..!

ముగిసిన జ్యేష్టాభిషేకం

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మంగళవారం స్వామివారికి కవచ సమర్పణతో జ్యేష్టాభిషేకం ఘనంగా ముగిసింది. మంగళవారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారు కల్యాణమండపంలోకి వేంచేపు చేశారు. ఉదయం 08.00 నుండి 11.30 గంటల వరకు శతకలశ స్నపనం, మహాశాంతి హోమం, తిరుమంజనం, సమర్పణ, కవచ ప్రతిష్ట, ఆరగింపు, అక్షతారోహణం నిర్వహించి బ్రహ్మఘోష వినిపించారు. అనంతరం శాత్తుమొరై, ఆస్థానం తదుపరి మధ్యాహ్నం 12.30 – 4.30 గం.ల మధ్య స్వామి అమ్మవార్లకు కవచ సమర్పణ చేశారు. అంతకుముందు తిరుమంజనంలో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, పంచామ తం, చెరకు, వివిధ రకాల పండ్లరసాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ఉభయ నాంచారులతో కలసి శ్రీవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, డిప్యూటీ ఈవో వి.ఆర్.శాంతి, ఏఈవో కె.మునికృష్ణారెడ్డి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి