Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Radhika Yadav: రాధిక అలా చేయడం తండ్రికి అస్సలు నచ్చేది కాదు.. సంచలన నిజాలు చెప్పిన ఫ్రెండ్

13 July 2025

Raidu Case Vinutha Kota Allegations,ఇది అంత చేసింది ఆ టీడీపీ ఎమ్మెల్యేనే.. కోట వినుత సంచలన ఆరోపణలు – raidu case vinutha kota and her husband made sensational allegations against tdp mla bojjala sudheer

13 July 2025

Kitchen Hacks: వంటగది జిడ్డుగా, మురికిగా ఉందా.. ఈ టిప్స్ తో నిమిషాల్లో శుభ్రం చేసుకోండి

13 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Tirumala Smoke Cars Not Allowed,తిరుమలకు ఆ కార్లలో వెళ్లొద్దు.. ఒకవేళ వెళ్లారో శ్రీవారి దర్శనం లేనట్లే, ఎందుకంటే? – ttd decided to identify and send back cars emitting smoke beyond the limits in tirumala
ఆంధ్రప్రదేశ్

Tirumala Smoke Cars Not Allowed,తిరుమలకు ఆ కార్లలో వెళ్లొద్దు.. ఒకవేళ వెళ్లారో శ్రీవారి దర్శనం లేనట్లే, ఎందుకంటే? – ttd decided to identify and send back cars emitting smoke beyond the limits in tirumala

.By .9 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tirumala Smoke Cars Not Allowed,తిరుమలకు ఆ కార్లలో వెళ్లొద్దు.. ఒకవేళ వెళ్లారో శ్రీవారి దర్శనం లేనట్లే, ఎందుకంటే? – ttd decided to identify and send back cars emitting smoke beyond the limits in tirumala
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Tirmala Cars Smoke Beyond Limits: తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ కీలక సూచన చేసింది. పొగ కాలుష్యం కలిగించే వాహనాలను అలిపిరి వద్ద తనిఖీ చేసి వెనక్కి పంపుతారు. పొల్యూషన్ సర్టిఫికెట్ లేకున్నా, స్మోక్ మీటర్ రీడింగ్ 4.0 దాటినా అనుమతించరు. మరోవైపు టీటీడీ ఉద్యోగి రాజశేఖర్ బాబును ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద సస్పెండ్ చేశారు. నందలూరు, తాళ్లపాకలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి, స్వామివారు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనమిస్తున్నారు.

హైలైట్:

  • తిరుమల వెళ్లే భక్తులకు గమనిక
  • ఇకపై ఆ వాహనాలకు నో పర్మిషన్
  • దర్శనం కూడా లేనట్లే.. టీటీడీ నిర్ణయం
తిరుమల పొగ కారులో వస్తే దర్శనం లేనట్లే
తిరుమల పొగ కారులో వస్తే దర్శనం లేనట్లే (ఫోటోలు– Samayam Telugu)

తిరమల వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక.. వాహనాల విషయంలో టీటీడీ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఇకపై పొగ వచ్చే వాహనాల్లో వస్తే తిరుమల శ్రీవారి దర్శనం లేనట్లే అంటోంది. ఈ మేరకు తిరుమలకు వచ్చే వాహనాలను తనిఖీ చేసేందుకు.. అలిపిరిలో చెకింగ్ సెంటర్ ఏర్పాటు చేసి.. పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ లేని వాహనాలతో పాటుగా పొగ ఎక్కువగా వదులుతున్న వాటిని తనిఖీ చేస్తారు. ఒకవేళ స్మోక్‌ మీటర్‌లో ఉద్గారాలు 4.0కు మించిఉంటే వెనక్కు పంపిస్తున్నారు. ఈ మేరకు భక్తులు ఈ విషయాన్ని గమనించి తిరుమలకు వెళితే మంచిదంటున్నారు. తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం ప్రతిరోజూ దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. వారిలో ఎక్కువమంది సొంత వాహనాల్లో ఘాట్ రోడ్డులో వస్తుంటారు. ఇలా రోజుకు వచ్చే ప్రైవేటు కార్లు 8 వేల వరకూ ఉంటాయని భావిస్తున్నారు. అయితే తిరుమల కొండపై వాయు కాలుష్యం అంతకంతకూ పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే పరిమితులకు మించి పొగ వచ్చే కార్లను గుర్తించి వెనక్కి పంపేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.

మరోవైపు టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ‘తిరుపతి జిల్లా పుత్తూరులోని స్వగ్రామంలో రాజశేఖర్ బాబు ప్రతీ ఆదివారం స్థానిక చర్చి ప్రార్థనల్లో పాల్గొంటున్నారని సమాచారం . ఈ వ్యవహారంతో టీటీడీ ఉద్యోగిగా ఆయన సంస్థ ప్రవర్తనా నియమావళిని పాటించలేదని భావించడమేకాక, హిందూ ధార్మిక సంస్థకు ప్రాతినిధ్యం వహించే ఉద్యోగి అయివుండి భాద్యతారహితంగా వ్యవహరించడం జరిగింది .ఈ క్రమంలో టీటీడీ విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదికను, ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం ఆయనపై శాఖపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఆయన్ను తక్షణమే సస్పెండ్ చేయడం జరిగింది’ అని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇకపై ఆర్టీసీ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ

నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా జూలై 08వ తేదీ ఉదయం పల్లకి ఉత్సవం చేపట్టారు. ఉదయం 11 గం.లకు స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి డోలోత్సవము చేప్టటారు. రాత్రి 07. 00 గం.లకు హనుమంత వాహనంపై శ్రీ సౌమ్యనాథ స్వామి భక్తులను అనుగ్రహించారు. జులై 09వ తేదీన ఉదయం శేష వాహనం, రాత్రి గరుడ వాహనంపై స్వామివారు భక్తులను ఆశీర్వదించనున్నారు. తాళ్లపాక శ్రీ సిద్దేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా జూలై 08వ తేదీ ఉదయం పల్లకీ సేవ, సాయంత్రం 06 – 07 గం.ల మధ్య చిన్నశేష వాహనంపై శ్రీ సిద్ధేశ్వర స్వామి విహరించారు. ఇవాళ ఉదయం పల్లకీ సేవ, సాయంత్రం సింహ వాహనంపై స్వామి వారు భక్తులను కటాక్షిస్తారు. తాళ్లపాక శ్రీ చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా జూలై 08వ తేదీ ఉదయం పల్లకీ ఉత్సవం నిర్వహించారు. రాత్రి 07.00 గం.లకు సింహ వాహనంపై స్వామి వారు విహరించి భక్తులను ఆశీర్వదించారు. ఇవాళ ఉదయం పల్లకీ సేవ చేపడుతారు. రాత్రికి హనుంత వాహనంపై శ్రీ చెన్నకేశవ స్వామి విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి