Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

అస్సలు లైట్ తీసుకోవద్దు.. శరీరంలో కనిపించే ఈ ఏడు సంకేతాలు యమ డేంజర్.. జాగ్రత్త సుమా..

13 July 2025

1 Kg Gold 3 Kg Silver Robbery Visakha 3 Kg Silver,విశాఖపట్నం: నెల రోజుల్లో పెళ్లి.. కిలో బంగారం.. 3 కిలోల వెండి.. రూ.20 లక్షలు చోరీ – massive robbery in visakhapatnam 1 kg gold and 3 kg silver and rs 20 lakh robbed

13 July 2025

Bed Time: నిద్రపోయే ముందు ఇలా చేస్తే కష్టమే.. డేంజర్ జోన్‌లోకి జారుకున్నట్లే భయ్యే..

13 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh Parent Teacher Meeting June 10th,ఏపీలో స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులు రెడీగా ఉన్నారా.. ఈసారి చిన్న మార్పు.. పూర్తి షెడ్యూల్, టైమింగ్స్ ఇవే – all set for andhra pradesh parent teacher mega meeting on july 10th 2025
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh Parent Teacher Meeting June 10th,ఏపీలో స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులు రెడీగా ఉన్నారా.. ఈసారి చిన్న మార్పు.. పూర్తి షెడ్యూల్, టైమింగ్స్ ఇవే – all set for andhra pradesh parent teacher mega meeting on july 10th 2025

.By .9 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh Parent Teacher Meeting June 10th,ఏపీలో స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులు రెడీగా ఉన్నారా.. ఈసారి చిన్న మార్పు.. పూర్తి షెడ్యూల్, టైమింగ్స్ ఇవే – all set for andhra pradesh parent teacher mega meeting on july 10th 2025
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh Parents Teachers Mega Meeting: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం మెగా పేరెంట్, టీచర్ సమావేశం నిర్వహిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరవుతారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే విషయాలపై చర్చిస్తారు. మొక్కలు నాటడం, ఆటల పోటీలు, భోజనాలు ఏర్పాటు చేశారు. ప్రతి విద్యార్థికి ప్రోగ్రెస్ కార్డు అందజేస్తారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంటకు ముగుస్తుంది. ఈ సమావేశంలో అనేక ఆసక్తికర అంశాలు ఉన్నాయి.

హైలైట్:

  • ఏపీలో మెగా పేరెంట్, టీచర్ సమావేశం
  • ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు
  • ప్రతి విద్యార్థికి ప్రోగ్రెస్ కార్డు కూడా ఇస్తారు
ఏపీ జులై 10న తల్లిదండ్రులతో సమావేశం
ఏపీ జులై 10న తల్లిదండ్రులతో సమావేశం (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం (ఈ నెల 10న) మెగా పేరెంట్, టీచర్ సమావేశం నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ మీటింగ్‌కు హాజరవుతారు. ఈ సమావేశంలో సమస్యలుంటే చెప్పడానికి అవకాశం ఉంటుంది.. అలాగే విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే విషయాల గురించి చర్చిస్తారు. ఈ సమావేశం సందర్భంగా.. మొక్కలు నాటడం, ఆటల పోటీలు, భోజనాలు వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అంతేకాదు ప్రతి విద్యార్థికి ప్రోగ్రెస్ కార్డును కూడా అందజేస్తారు.రాష్ట్రవ్యాప్తంగా ఈ సమావేశం గురువారం ఉదయం 9 గంటలకు మొదలవుతుంది. తల్లిదండ్రులను, ముఖ్య అతిథులను స్కూళ్లకు పిలుస్తారు. స్కూళ్లలో ఓపెన్ హౌస్ ఫొటోబూత్ ఏర్పాటు చేస్తారు. అక్కడ విద్యార్థులు, తల్లిదండ్రులు ఫొటోలు దిగుతారు. తల్లిదండ్రులు పిల్లలతో కలిసి తరగతి గదుల్లో కూర్చుంటారు.. ముఖ్య అతిథులు హెచ్‌ఎం గదిలో ఉంటారు. క్లాస్ టీచర్లు ప్రతి విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడతారు. పిల్లల ప్రోగ్రెస్, హెల్త్ కార్డులు ఇస్తారు. ఈ సమావేశంలో తల్లికి వందనం పథకం, పాజిటివ్ పేరెంట్ మీటింగ్, మనబడి మేగజైన్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటివాటి గురించి వివరిస్తారు. ఉదయం 11 గంటలకు విద్యార్థులు తమ తల్లులకు పుష్పాలు అందజేసి, కాళ్లకు నమస్కారం చేస్తారు. అనంతరం తల్లి పేరుతో మొక్కను నాటుతారు.

అంతేకాదు ఈ కార్యక్రమంలో నో టు డ్రగ్స్, సైబర్ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో స్కూల్ అభివృద్ధిలో తాము కూడా భాగస్వాములం అవుతామని ప్రతిజ్ఞ చేస్తారు. అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులు, అతిథులు, విద్యా కమిటీ సభ్యులు, పూర్వ విద్యార్థులు కలిసి స్కూళ్లలోనే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం చేస్తారు. సరిగ్గా మధ్యాహ్నం 1 గంటకు కార్యక్రమం ముగుస్తంది. ఈ మెగా సమావేశంలో ప్రతి విద్యార్థికి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు (సమగ్ర ప్రగతి పత్రం) కూడా ఇస్తారు. ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు ప్రైవేట్ స్కూల్ విద్యార్థులతో పోటీగా ఈ కార్డులు ఇస్తున్నారు. ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో విద్యార్థి వివరాలు, మార్కులు, హాజరు, నైపుణ్యాలు వంటివి ఉంటాయి. ఈ ఏడాది తల్లిదండ్రుల అభిప్రాయానికి కూడా అవకాశం కల్పించింది ప్రభుత్వం.

అప్పుడు మా నాన్నను తిట్టుకునేవాడినన్న మంత్రి లోకేష్

మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చే ఆప్షనల్ సెలవుల పై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రభుత్వం ఇచ్చే ఆప్షనల్ సెలవులు కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే వర్తిస్తాయి. ఇవి స్కూలు మొత్తానికి ఇచ్చేందుకు కాదు. అటు ప్రభుత్వ టీచర్లు ప్రైవేట్ స్కూళ్లు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.. ఎవరైనా ప్రభుత్వ టీచర్లు ప్రైవేట్ బడుల్లో కనిపిస్తే చర్యలు తీసుకుంటాము’ అన్నారు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి