
మత్తు పదార్థాల నిర్మూలనపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో మత్తు పదర్ధాలకు బానిసలు అవుతున్న యువతతో పాటు ఇతరులను మార్చి సభ్య సమాజంలో వారికి మంచి భవిష్యత్తు ఇవ్వడమే కాకుండా.. సమాజ శ్రేయస్సుకు దోహద పడే వ్యక్తులుగా తీర్చి దిద్ధాలనే సదుద్దేశంతో ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే గంజాయి, పొగాకు ఉత్పత్తులు, గుట్కా, ఇతర మత్తుపధార్ధాల వినియోగాన్ని అరికట్టడం, వీటి వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాడానికి పలు కార్యక్రామాలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు అధికారులు ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ పేరుతో రాష్ట్రంలోని స్కూల్స్, కాలేజెస్ పరిసర ప్రాంతాల్లోని గుట్కాలు, మత్తు పదార్థాలు విక్రయిస్తున్న దుకాణాలపై దాడులు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా మత్తు పదార్థాలు విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ జిల్లా నగర పోలీస్ కమీషనరేట్ పరిధిలో వివిధ కళాశాలలు, స్కూల్స్ ఉన్న పరిసర ప్రాంతాలలో ఉన్న అన్నీ పాన్ షాప్స్‌ను, బడ్డీ కోట్లలలో ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజారోగ్యాన్ని పాడు చేసే పొగాకు ఉత్పత్తులపై అనుమతులుకు వ్యతిరేకంగా, గుట్కా నిల్వలను ఇతర మత్తు పధార్ధాలను కలిగి ఉంటూ, విక్రయాలకు పాల్పడుతున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు. వాటి వద్ద అక్రమంగా కలిగిఉన్న పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకుని ఆయా యజమానులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈ సోదాలు నిరంతరం కొనసాగుతాయని, యువతను పాడు చేసే మత్తు పదార్థాలు, పొగాకు ఉత్పత్తుల నిల్వలు కలిగి ఉన్న, అక్రమంగా వాటిని విక్రయాలు జరిపిన ఏ మాత్రం ఉపేక్షించేది లేదని ఎన్జీఆర్ జిల్లా పోలీసులు హెచ్చరిస్తున్నారు.
అలాగే వివిధ కళాశాలలో విద్యార్థినీ, విధ్యార్ధులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి గంజాయి, పొగాకు ఉత్పత్తులు, గుట్కా, ఇతర మత్తుపధార్ధాలను సేవించడం వలన కలిగే అనార్ధాల గురించి ప్రత్యేక నిపుణులతో అవగాహన కల్పిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.