తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఒకప్పుడు విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకోవాలని అనుకుంది. కానీ డబ్బులు లేకపోవడంతో చదువును మధ్యలోనే ఆపేసింది. ఆ తర్వాత షాపింగ్ మాల్స్ కోసం యాడ్స్ చేసింది. దీంతో నెమ్మదిగా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి సినిమా అవకాశాలు అందుకుంది. కట్ చేస్తే.. తక్కువ సమయంలోనే సౌత్ ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కట్ చేస్తే.. ఇప్పుడు రూ.100 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించుకుంది. ఆమె ఎవరో తెలుసా.. ? మొదట్లో ఆమె జీతం కేవలం 500 రూపాయాలు మాత్రమే. ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ సమంత.
భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలు సమంత ఒకరు. సౌత్ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు తన కృషి, అంకితభావంతో అగ్ర స్థాయికి చేరుకుంది. అయితే ఈ రోజుల్లో కోట్లలో జీతం పొందుతున్న సమంత కూడా చిన్న ఉద్యోగంతోనే ప్రారంభించిందని చాలా తక్కువ మందికి తెలుసు. ఒక ఇంటర్వ్యూలో సమంత తన మొదటి ఉద్యోగం, మొదటి జీతం గురించి అనేక విషయాలు పంచుకుంది. 11వ తరగతి తర్వాత ఉన్నత చదువులు చదవాలని అనుకుందట. కానీ ఆర్థికంగా ఇబ్బంది ఉండడంతో ఒక హోటల్‌లో హోస్టెస్‌గా పనిచేశానని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో కాన్ఫరెన్స్‌కు 8 గంటలు పనిచేసినందుకు ఆమెకు 500 రూపాయలు వచ్చేవని తెలిపింది. తన మొదటి జీతం చాలా ప్రత్యేకమైన జ్ఞాపకం అని తెలిపింది.
ఇవి కూడా చదవండి
ఏమాయ చేశావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సమంత.. ఆ తర్వాత తెలుగు, తమిళం భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఆమె ఒకరు. నటిగానే కాకుండా నిర్మాతగానూ సక్సెస్ అయ్యింది. ‘పుష్ప’లో సమంత 3 నిమిషాల పాట కోసం ఆమె 5 కోట్లు వసూలు చేసిందని టాక్. అలాగే ‘సిటాడెల్: హనీ బన్నీ’ అనే హిందీ వెబ్ సిరీస్ కోసం 10 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్.
ఇవి కూడా చదవండి :
OTT Movie: ఇదెక్కడి సినిమా రా బాబు.. బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది.. 5 రోజుల్లోనే 2700 కోట్లతో..
Tollywood: రోజుకు రూ.35 జీతం.. ఇప్పుడు కోట్లకు యజమాని.. అయినా పల్లెటూరిలో జీవితం..
Tollywood : అప్పుడు ప్రభాస్ సరసన హీరోయిన్గా.. ఇప్పుడు స్పెషల్ సాంగ్‌తో రచ్చ.. ఎవరంటే..
Tollywood: చేసింది మూడు సినిమాలే.. 64 ఏళ్ల నటుడితో ప్రేమ.. చివరకు అపార్ట్మెంట్లో ఊహించని విధంగా..