Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Gold Anklets: కాళ్లకు బంగారు పట్టిలు ధరించవచ్చా.? పండితుల మాటేంటి.?

12 July 2025

చాలా సీక్రెట్ మ్యాటర్‌… ఎవరికి చెప్పొద్దంటూ రూ.18.50 లక్షల టోకరా!

12 July 2025

Viral: నేను పోటుగాడ్ని అంటూ 40 లీటర్లు పాలతో స్నానం – ఇంతకీ అతను ఏం సాధించాడంటే..?

12 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Tirumala Quality Food Must,తిరుమలలో శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. తక్కువ ధరకే ఫుడ్, టీటీడీ కీలక ఆదేశాలు – quality food must be served in big and janata canteens to tirumala devotees says ttd eo
ఆంధ్రప్రదేశ్

Tirumala Quality Food Must,తిరుమలలో శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. తక్కువ ధరకే ఫుడ్, టీటీడీ కీలక ఆదేశాలు – quality food must be served in big and janata canteens to tirumala devotees says ttd eo

.By .10 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tirumala Quality Food Must,తిరుమలలో శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. తక్కువ ధరకే ఫుడ్, టీటీడీ కీలక ఆదేశాలు – quality food must be served in big and janata canteens to tirumala devotees says ttd eo
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Tirumala Big Janata Canteens: తిరుమలలో భక్తుల కోసం బిగ్, జనతా క్యాంటిన్లలో నాణ్యమైన ఆహారం అందించాలని టీటీడీ ఈవో అధికారులకు సూచించారు. హోటళ్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించి, నాణ్యత, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు. తక్కువ ధరలకే భోజనం అందించాలని తెలిపారు. ఈ మేరకు ఆయన కీలక సూచనలు చేశారు. మరోవైపు శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

హైలైట్:

  • తిరుమల శ్రీవారి భక్తులకు తీపికబురు
  • లాభాపేక్ష లేకుండా చూడాలన్న టీటీడీ
  • నిర్దేశించిన ధరల ప్రకారం ఆహార పదార్ధాలు
తిరుమల బిగ్ జనతా క్యాంటిన్ నాణ్యమైన ఆహారం
తిరుమల బిగ్ జనతా క్యాంటిన్ నాణ్యమైన ఆహారం (ఫోటోలు– Samayam Telugu)

తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు బిగ్, జనతా క్యాంటిన్లలో నాణ్యమైన ఆహార పదార్ధాలు అందించాలన్నారు టీటీడీ ఈవో జె శ్యామల రావు కోరారు. టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో గుర్తింపు ఉన్న హోటళ్ల నిర్వాహకులతో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి ఈవో సమావేశం నిర్వహించారు. తిరుమలలో బిగ్, జనతా క్యాంటీన్ల నిర్వహణ కోసం గత నెల 23వ తేదీ నోటిఫిషన్ జారీ చేశారు. సదరు ఈవోఐ సంబంధించిన సందేహాలపై గుర్తింపు ఉన్న హోటళ్ల నిర్వాహకులు తమ ఆసక్తిని వ్యక్తం చేసేందుకు (EOI)/ ఫ్రీ బిడ్ మీటింగ్‌ను టీటీడీ ఈవో జె శ్యామల రావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి నిర్వహించారు.తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రపంచ వ్యాప్తంగా భక్తులు వస్తుంటారని.. వారికి సేవా దృక్పధంతో నాణ్యమైన ఆహార పదార్థాలు, పరిశుభ్రత, లాభాపేక్ష లేకుండా నిర్ధేశించిన ధరలకు అందించాలి. తిరుమలలో బిగ్, జనతా హోటళ్ల నిర్వహణలో నాణ్యత ప్రమాణాలు, పరిశుభధ్రత పాటించాలి.. లాభాపేక్ష లేకుండా నిర్దేశించిన ధరల ప్రకారం ఆహార పదార్ధాలను అందించాలి. నిర్థారించిన నియమాలకు లోబడి బిగ్, జనతా క్యాంటిన్‌లలో కేటాయింపు ఉంటుంది’ అని ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య అన్నారు.

ఈ సమావేశంలో బిగ్, జనతా హోటళ్ల నిర్వహణలో టెండర్ ప్రాసెస్, తదితర నియమ నిబంధనలను గుర్తింపు, ఆసక్తి ఉన్న హోటళ్ల నిర్వాహకులు నివృత్తి చేసుకున్నారు. హోటళ్ల నిర్వాహకులు పలు సందేహాలు వ్యక్తం చేయగా వాటిని టిటిడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి నివృత్తి చేశారు. ఈ సమావేశంలో అదనపు ఎఫ్.ఏ.ఓ రవి ప్రసాద్, తిరుమల ఎస్టేట్ ఆఫీసర్ కె వెంకటేశ్వర్లు, ఆసక్తి , గుర్తింపు ఉన్న పలు హోటళ్ల నిర్వాహకులు పాల్గొన్నారు.

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. లడ్డూల కోసం క్యూ అవసరం లేదు

ముగిసిన పవిత్రోత్సవాలు

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు బుధవారం మహాపూర్ణాహుతితో వైభవంగా ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం యాగశాల పూజ, హోమం, మహా పూర్ణాహుతి, కలశోధ్వాసన, మూలవర్లకు కలశాభిషేకం, పట్టుపవిత్ర సమర్పణ చేపట్టారు. మధ్యాహ్నం 03.00 – 03.30 గం.ల మధ్య అభిషేకం, అనంతరం అలంకారం, సహస్రనామార్చన నిర్వహించారు. సాయంత్రం పంచమూర్తులైన శ్రీ వినాయక స్వామి, వళ్లి దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్యస్వామి, శ్రీ కపిలేశ్వర స్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ చండికేశ్వరస్వామివారి తిరువీధి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. పవిత్రోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు పవిత్రమాల, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి