Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Video : ఏమి జోకేశాడేమో..పంత్ తెగ నవ్వేస్తున్నాడు.. ఏదేమైనా గంభీర్లో సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగానే ఉంది

12 July 2025

Coral Jewellery: పగడపు నగలు ధరిస్తే లాభాలు ఏంటి.? జ్యోతిష్యం ఏం చెబుతుందంటే.?

12 July 2025

Gold Anklets: కాళ్లకు బంగారు పట్టిలు ధరించవచ్చా.? పండితుల మాటేంటి.?

12 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ongole Nagarjuna Sagar New Airports,ఏపీలో కొత్తగా రెండు ఎయిర్‌పోర్ట్‌లు.. ఆ జిల్లాల దశ తిరిగింది, బిడ్‌లకు ఆహ్వానం – apadcl issued notification to prepare a technical and economic feasibility report for ongole and nagarjunasagar new airports
ఆంధ్రప్రదేశ్

Ongole Nagarjuna Sagar New Airports,ఏపీలో కొత్తగా రెండు ఎయిర్‌పోర్ట్‌లు.. ఆ జిల్లాల దశ తిరిగింది, బిడ్‌లకు ఆహ్వానం – apadcl issued notification to prepare a technical and economic feasibility report for ongole and nagarjunasagar new airports

.By .10 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ongole Nagarjuna Sagar New Airports,ఏపీలో కొత్తగా రెండు ఎయిర్‌పోర్ట్‌లు.. ఆ జిల్లాల దశ తిరిగింది, బిడ్‌లకు ఆహ్వానం – apadcl issued notification to prepare a technical and economic feasibility report for ongole and nagarjunasagar new airports
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Ongole Nagarjuna Sagar Airports: ఆంధ్రప్రదేశ్‌లో ఒంగోలు, నాగార్జునసాగర్‌లో కొత్త విమానాశ్రయాలు రానున్నాయి. వీటి నిర్మాణానికి సాంకేతిక, ఆర్థిక సాధ్యత నివేదిక కోసం బిడ్లను ఆహ్వానిస్తూ ఏపీఏడీసీఎల్‌ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు, ఎస్‌పీఎస్‌ అధికారులకు ఐపీఎస్‌ ప్రమోషన్ల కోసం కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సస్వర్ణాంధ్ర-2047లో భాగంగా విజన్‌ యాక్షన్‌ ప్లాన్‌ యూనిట్‌ కార్యాలయాలకు రూ.20.10 కోట్ల నిధులు విడుదలయ్యాయి. అమరావతి పరిపాలన నగరానికి సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. శ్రీశైలం ప్రాజెక్టులో మరమ్మత్తుల కోసం సీలైన్‌ సంస్థకు బాధ్యతలు అప్పగించారు.

హైలైట్:

  • ఏపీలో కొత్తగా రెండు ఎయిర్‌పోర్ట్‌లు
  • టీఈఎఫ్‌ఆర్ తయారు చేయనున్నారు
  • బిడ్లను ఆహ్వానించిన ఏపీఏడీసీఎల్‌
ఏపీలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లు
ఏపీలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లు (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఎయిర్‌పోర్ట్‌ల ఏర్పాటుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో రెండు కొత్త విమానాశ్రయాలు రానున్నాయి. ఒంగోలు, నాగార్జునసాగర్‌లో వీటిని నిర్మించనున్నారు. ఈ విమానాశ్రయాల నిర్మాణం కోసం సాంకేతిక, ఆర్థిక సాధ్యత నివేదిక (టీఈఎఫ్‌ఆర్‌) తయారు చేయనున్నారు. దీని కోసం రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్‌) ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 29 వరకు బిడ్‌లు దాఖలు చేయడానికి గడువు ఉంది. టెక్నికల్ బిడ్‌లను మరుసటి రోజు తెరుస్తారు. అర్హత పొందిన సంస్థల ఫైనాన్షియల్ బిడ్‌లను ఆగస్టు 4న తెరుస్తారు. బిడ్ దక్కించుకున్న సంస్థకు 30 రోజుల్లో ఎల్‌వోఏ జారీ చేస్తామని ఏపీఏడీసీఎల్‌ తెలిపింది. అంటే, ఆ సంస్థకు అనుమతి లభిస్తుంది. ఒంగోలులో విమానాశ్రయం నగరానికి 7 కి.మీ దూరంలో ఉంటుంది. ఈ మేరకు ఎయిర్‌పోర్ట్‌కు అవసరమైన భూమిని ప్రభుత్వం గుర్తించింది. నాగార్జునసాగర్‌లో విమానాశ్రయాన్ని విజయపురి సౌత్ దగ్గర నిర్మిస్తారు.

ఏపీ ప్రభుత్వం మరికొన్ని అప్డేట్స్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పోలీసు సర్వీసు (ఎస్‌పీఎస్‌) అధికారులకు కన్ఫర్డ్‌ ఐపీఎస్‌లుగా ప్రమోషన్‌లు కల్పించేందుకు కమిటీ ఏర్పాటైంది. 2024 ఏడాదికి సంబంధించి అర్హులను ఈ కమిటీ ఎంపిక చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్, డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తాను సభ్యులుగా యూపీఎస్సీ ఛైర్మన్‌ అధ్యక్షతన కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 15న ఢిల్లీలో కమిటీ సమావేశం కానుంది.

సస్వర్ణాంధ్ర-2047 అమల్లో భాగంగా జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన విజన్‌ యాక్షన్‌ ప్లాన్‌ యూనిట్‌ కార్యాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.20.10 కోట్ల నిధులు విడుదల చేసింది. కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇతర పరికరాలకు సంబంధించి ఒక్కో యూనిట్‌కు వన్‌టైమ్‌ గ్రాంటు కింద రూ.10లక్షలు మంజూరు చేసింది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలు, 26 జిల్లా కేంద్రాల్లో విజన్‌ యాక్షన్‌ ప్లాన్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గ యూనిట్‌కు ఛైర్మన్‌గా ఎమ్మెల్యే, కార్యనిర్వాహక వైస్‌ ఛైర్మన్‌గా ప్రత్యేక అధికారి ఉండనున్నారు. జిల్లా స్థాయిలో ఛైర్మన్‌గా ఇన్‌ఛార్జీ మంత్రి, కార్యనిర్వాహక వైస్‌ ఛైర్మన్‌గా కలెక్టర్‌ ఉంటారు’ అని తెలిపారు.

‘రాజధాని అమరావతిలో 1,575 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న పరిపాలన నగరం సరిహద్దులు, జోనింగ్‌ నిబంధనలు, పట్టణ రూపకల్పన మార్గదర్శకాలను నోటిఫై చేస్తూ రాష్ట్రప్రభుత్వం ఇటీవల గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇవి తాజాగా వెలుగులోకి వచ్చాయి. బృహత్తర ప్రణాళికను ప్రభుత్వం ఇప్పటికే రూపొందించింది. తాజాగా దాన్నీ ఈ నోటిఫికేషన్‌కు జతచేసింది. జోనింగ్‌ నిబంధనలు, పట్టణ రూపకల్పన మార్గదర్శకాలను సీఆర్‌డీఏ వెబ్‌సైట్‌లో ఉంచింది’ అన్నారు.

శ్రీశైలం నుంచి సాగర్ దిశగా కృష్ణమ్మ పరుగులు.. జలహారతి ఇచ్చిన సీఎం

‘శ్రీశైలం ప్రాజెక్టులో ఏప్రాన్‌ దిగువన స్టీల్‌ సిలిండర్ల పరిస్థితి ఏంటి? ప్లంజ్‌పూల్‌ ఎలా ఉంది.. తదితర అంశాలను నీటి లోపల నుంచి వీడియో, ఫొటోలు తీసి అధ్యయనం చేసే బాధ్యతలను విశాఖకు చెందిన సీలైన్‌ ఆఫ్‌షోర్‌ డైవింగ్‌కు అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం ర్యాటిఫై చేసింది’ అని ఒక ప్రకటనలో తెలిపారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి