ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ గా చేసిన సినిమా బాహుబలి. తెలుగు సినిమా సత్తాను ఇండియా వైడ్ గా చాటి చెప్పిన సినిమా బాహుబలి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది. వెయ్యికోట్లు వసూల్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ప్రభాస్ హీరో, రానా దగ్గుబాటి విలన్ గా నటించిన బాహుబలి సినిమాలో తమన్నా, అనుష్క హీరోయిన్స్ గా నటించారు. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా రెండు మంచి విజయాలను అందుకుంది. ‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమా విడుదలై 2025 జులై 10 నాటికి సరిగ్గా పదేళ్లు పూర్తి చేసుకుంది. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నాలతో పాటు రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ లాంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా 2015లో విడుదలై రూ. 600 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డులు సృష్టించింది, అంతర్జాతీయంగా పలు అవార్డులు అందుకుంది.
ఇది కూడా చదవండి : జిమ్‌కు వెళ్లడం మానేశా.. ఆ పని చేసి బరువు తగ్గా.. సీక్రెట్ రివీల్ చేసిన స్టార్ హీరోయిన్
మొదట రూ. 150 కోట్లతో సింగిల్ పార్ట్‌గా ప్లాన్ చేసిన ఈ చిత్రం, నిడివి పెరగడంతో రెండు భాగాలుగా రూ. 250 కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. ప్రభాస్ బాహుబలి పాత్ర కోసం 105 కిలోల బరువు పెంచి, శివుడి పాత్ర కోసం 85 కిలోలకు తగ్గారు. రానా 33 కిలోలు పెంచారు. ప్రభాస్ ఇంట్లో రూ. 1.5 కోట్లతో జిమ్ కూడా ఏర్పాటు చేసుకున్నాడట.. అలాగే ఈ సినిమా షూటింగ్ విషయానికొస్తే హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఎక్కువ భాగం చిత్రీకరించగా, బల్గేరియాలో మంచు కొండల సన్నివేశాలు తెరకెక్కించారు.
ఇది కూడా చదవండి : ఒకప్పుడు యాంకర్.. ఇప్పుడు స్టార్ హీరోయిన్..! ఒక్క సినిమాకు రూ.25కోట్లు తీసుకుంటున్న బ్యూటీ
బాహుబలి సినిమా కోసం కొత్తగా కిలికిలి భాషను రూపొందించారు. ఇక ఈ సినిమా 18 కోట్ల బిజినెస్‌పై 186 కోట్ల లాభంతో ఆల్-టైమ్ హైయెస్ట్ ప్రాఫిట్ రికార్డు నమోదు చేసింది. బాహుబలి తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచి, ప్రపంచవ్యాప్తంగా దాని విజువల్ వండర్ గా పేరు తెచ్చుకుంది. ఇక బాహుబలి 10ఏళ్లు పూర్తి చేసుకోవడంతో ప్రభాస్ అభిమానులు పలు హ్యాష్‌ట్యాగ్‌లతో ట్రెండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి : అందంగా లేదని అప్పుడు అవమానించారు.. కట్ చేస్తే ఇప్పుడు అదే బ్రాండ్‌కు అంబాసిడర్‌గా
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి