కొంతమంది చిన్న విషయాలకే కోపంతో ఊగిపోతారు. అవతలి వ్యక్తులపై దాడికి పాల్పడతారు. ఓ వ్యక్తి 12 ఏళ్ల బాలుడిపై దాడికి పాల్పడ్డాడు. చెంప దెబ్బలు కొడుతూ, చేతిపై కొరుకుతూ విచక్షణారహితంగా దాడి చేశారు. సెక్యూరిటీ సిబ్బంది ఆపినా ఆగకుండా బాలుడిని కొడుతూనే ఉన్నాడు. ఈ దాడిలో బాలుడికి పలు గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.మహారాష్ట్ర థానే జిల్లాలోని అంబర్‌నాథ్‌లో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. జూలై 4న సాయంత్రం 5 గంటల సమయంలో పటేల్ జెనాన్ హౌసింగ్ సొసైటీలో ఓ బాలుడు ట్యూషన్ వెళ్లేందుకు 14వ ఫ్లోర్‌లో లిఫ్ట్ ఎక్కాడు. 9వ ఫ్లోర్‌లో లిఫ్ట్ ఆగగా.. అక్కడ ఎవరూ లేకపోవడంతో లిఫ్ట్ డోర్లు క్లోజ్ చేసేందుకు యత్నించాడు. ఇంతలో ఓ వ్యక్తి లిఫ్ట్ లోపలకి దూసుకొచ్చి బాలుడిపై దాడి చేశాడు. డోర్లు ఎందుకు మూస్తున్నావంటూ ఇష్టమొచ్చిట్లుగా కొట్టాడు.
లిఫ్ట్ లోపలే ఉన్న హౌస్ కీపింగ్ మహిళ దాడిని ఆపడానికి ప్రయత్నించిన లాభం లేకపోయింది. వెంటనే లిఫ్ట్ ఆపి బాలుడిని బయటకు పంపించింది. అయితే బయట లాబీలో కూడా నిందితుడు బాలుడిని కొడుతూనే ఉన్నాడు. అంతేకాకండా కత్తితో పొడిచి చంపేస్తనంటూ బెదిరించాడు. దాడి తర్వాత బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలుత కేసును లైట్ తీసుకున్న పోలీసులు.. నాలుగు రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీసీటీవీ పుటేజీ పరిశీలించి.. పోలీసులు ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. చిన్నపిల్లాడిపై దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని బాలుడి తండ్రి డిమాండ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
This man slapped a child multiple times, bit his hand, and threatened him, saying, “Meet me outside, I’ll stab you with a knife.”
All this anger because he thought the kid closed the lift. In reality, the kid stopped the lift and opened it for him.
This happened in Ambernath,… pic.twitter.com/FpE742paTX
— Incognito (@Incognito_qfs) July 9, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.